ఎంత మంది హీరోయిన్లని తన అవసరాల కోసం వాడుకున్నాడు?

సిల్వర్ స్క్రీన్ పై ముద్దుగుమ్మలను రాంగోపాల్ వర్మ ఎంత అందంగా చూపెడతారో తెలిసిన విషయమే. సాంప్రదాయ కట్టులో అయినా, వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ లో అయినా హీరోయిన్లను చూడముచ్చటగా ప్రెజెంట్ చేస్తారనే పేరు సినీ వర్గాల్లో ఉంది. అయితే ఇదే సమయంలో ఒకే హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న సందర్భాలలో వర్మకు – సదరు హీరోయిన్ కు మధ్య ఏదో ఉందని రకరకాల రూమర్స్ తో పాటు ఎఫైర్లంటూ హల్చల్ చేసిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

అయితే ఎప్పుడూ తానూ ఓపెన్ గా మాట్లాడతానని చెప్పే వర్మ, ఇదే అంశంపై తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ వారాంతపు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ‘ముఖాముఖీ’లో బదులిచ్చారు వర్మ. సదరు మీడియా ప్రతినిధి అడిగిన “ఎంత మంది హీరోయిన్లని వర్మ తన అవసరాల కోసం వాడుకున్నాడు?” అన్న దానికి జవాబుగా “ఒక్కసారి ఒక్కళ్ళను కూడా వాడుకోలేదు… నెవర్…” అంటూ సమాధానమిచ్చారు.

అయితే ఇది సందర్భంలో ఈ ప్రశ్నలో ఉన్న ‘ఎంత మంది’ మరియు ‘అవసరాల’ గురించి మీడియా ప్రతినిధి – వర్మ మధ్య పెద్ద చర్చే జరిగింది. “హీరోయిన్లతో అవసరమంటే బెడ్ షేర్ చేసుకోవడమేగా మీ దృష్టిలో…” అని వర్మ బదులిచ్చేసరికి ఖంగుతిన్న మీడియా ప్రతినిధి తన మాట మార్చి, తానూ ఆ దృష్టిలో అడగలేదని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసారు. అయితే అర్ధమవ్వలసిన విషయాలన్నీ వీక్షకులకు స్పష్టంగా అర్ధమైపోవడం అప్పటికే జరిగిపోయిన అంశం. బహుశా వర్మ ఇంత ఓపెన్ గా మాట్లాడతారని సదరు మీడియా ప్రతినిధి కూడా ఊహించి ఉండరు. మరి వర్మ స్పెషాలిటియే అది కదా మరి!

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

4 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

7 hours ago