Telugu

30 రూపాయలు నుండి 30,000 కోట్లకు ఎదిగిన వ్యక్తి!

అండర్ వరల్డ్ డాన్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడిగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ తాజాగా “రాయ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను దాదాపు 55 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT

క్రైమ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో అనే దానిని నిరూపించిన ఏకైక వ్యక్తి.., జేబులో 30 రూపాయలు నుండి 30 సంవత్సరాల తర్వాత 30,000 కోట్ల వరకు ఎలా ఎదిగాడు… బ్యాంక్ లో క్లర్క్ నుండి ప్రస్తుతం అతనే ఒక బ్యాంక్ గా ఎలా రూపొందాడు… ఇలా ఆసక్తికరమైన అంశాలతో వర్మ మార్క్ “రాయ్” చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది.

‘రాయ్’ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తుండగా… వర్మ చెప్పిన స్టోరీ… పూరీ జగన్నాధ్ – ప్రిన్స్ మహేష్ బాబుల “బిజినెస్ మెన్” కధను తలపిస్తుండడం విశేషం. క్రైమ్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించవచ్చో, బ్యాంక్ దోపిడీ చేసిన వాడు బ్యాంక్ ను ఎలా స్థాపించాడో అనే విధానాన్ని ‘బిజినెస్ మెన్’ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు పూరీ. ‘శిష్యుడు’ చేసిన కధను ‘గురువు’ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తాడామో చూడాలి.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

TFPC Election Results 2026: C Kalyan’s Mana Panel Scores Big Win

The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…

12 minutes ago

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

39 minutes ago