“వంగవీటి”కి చైన్లు చుట్టిన వర్మ!

రాంగోపాల్ వర్మ చివరి చిత్రంగా రూపుదిద్దుకుంటున్న “వంగవీటి”పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. దానికి తగిన విధంగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ వర్మ స్థాయిలో ఉందన్న టాక్ రాగా, తాజాగా టైటిల్ లోగోను ఆవిష్కరించారు.

వర్మ మనసు పెట్టి సినిమాలు తీస్తే ఎలా ఉంటాయో ఒక రక్తచరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ వంటి చిత్రాలు నిరూపించాయి. బహుశా ఆ బాటలోనే ‘వంగవీటి’ సినిమా కూడా పయనించే విధంగా ఉంది. వంగవీటి పేరుకు చైన్లు చుడుతూ… బ్యాక్ గ్రౌండ్ లో గాలిలో ఎగురుతున్న కత్తి, ఎర్ర జెండా, ప్రకాశం బ్యారేజ్ తో కూడిన పోస్టర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

బహుశా సినిమా కధను ఈ టైటిల్ లో చెప్పినట్లుగా కనపడుతోంది. చలసాని వెంకటరత్నం హత్య ఎర్ర జెండాను ప్రతిబింబిస్తుందని, అలాగే ఎగురుతున్న కత్తి రంగా హత్యను సూచిస్తుందని, ఈ రెండింటి మధ్య “వంగవీటి” కుటుంబం యొక్క బంధమే… ‘వంగవీటి’ టైటిల్ కు చైన్లు చుట్టారని సోషల్ మీడియా వేదికగా వర్మ క్రియేటివిటీ గురించి ప్రస్తావిస్తున్నారు.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

1 hour ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago