Telugu

వర్మ దిగజారుడుతనానికి నిదర్శనం…!

దేశ రాష్ట్రాలలో ఏది హాట్ టాపిక్ గా నిలిస్తే, దానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ పొందడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల ‘అర్జున్ రెడ్డి’ సినిమా విషయంలో పవన్ ఫ్యాన్స్ తో చెలగాటం ఆడిన వర్మ, తాజాగా వంగవీటి రంగా అభిమానులతో కయ్యానికి కాలు దువ్వేలా ఫేస్ బుక్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం విజయవాడ వేదికగా ఏపీలో జరుగుతోన్న ‘కాపు కుల’ రాజకీయంపై స్పందిస్తూ… వంగవీటి రంగా మరియు రత్నకుమారిలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ADVERTISEMENT

వంగవీటి రాధ మరియు రత్నకుమారిల ఫోటోలు పోస్ట్ చేసిన వర్మ… తన భార్య, కుమారుడ్ని చూసి వంగవీటి రంగా స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ వేస్తారని సెటైర్లు వేసారు. తనకు వంగవీటి రంగా భార్య మరియు కుమారుడు అంటే ఎంతో అభిమానమని అన్న వర్మ, తల్లి నల్లగా, కుమారుడు తెల్లగా ఎందుకున్నారో ప్రముఖ కాస్మోటిక్స్ సంస్థ ‘లోరియల్’ చెప్పాలని, కాస్త హద్దులు దాటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లో మాట్లాడడం వర్మ దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తోందని వంగవీటి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

‘వంగవీటి’ సినిమా పేరుతో దేవినేని వర్గానికి అనుకూలంగా సినిమాను తీసి, చరిత్రను వక్రీకరించిన వర్మ నోటి నుండి ఇంతకంటే మంచి మాటలు ఎక్కడ నుండి వస్తాయిలేనని రంగా అభిమానులు మండిపడుతున్నారు. వర్మ చేసిన ‘లోరియల్’ కామెంట్ నే ఉదహరిస్తూ… వర్మ ఈ కలర్ లో ఉంటే, ఆమె కూతురు తెల్లగా ఎలా ఉందో కూడా చెప్పాలని సోషల్ మీడియా వేదికగా చేస్తున్న డిమాండ్స్ కోకొల్లలు. ఒక్కోసారి వర్మ మరీ బోర్డర్స్ దాటి మాట్లాడుతున్నారనడానికి ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Kalki 2: Nag Ashwin Raises Major Doubts on Prabhas Film

Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…

9 minutes ago

Devaraaya: Kichcha Sudeepa In A Powerful Historical Avatar

Kichcha Sudeepa needs no special introduction to the Telugu audiences. The actor’s next project has…

24 minutes ago