
“వంగవీటి రంగా గురించి కొడుకు రాధ కన్నా నాకు ఎక్కువ తెలుసు. కానీ, తనకి తెలియని తన పెదనాన్న అసలు విషయాలు నాకు తెలుసు. ఎందుకంటే ఇవ్వాల్టి రాధ అప్పుడు పిల్లోడు, చెప్పుడు మాటలు నమ్మాడు, కానీ నేనప్పుడు స్పాట్ లో ఉన్నా. ఎప్పుడూ స్పాట్లో లేని వాళ్ళు కేవలం స్పాట్లు పెట్టిన వాళ్ళకి పుట్టినంత మాత్రాన వాళ్ళే స్పాట్లనుకుంటే అది వాళ్ళ పిల్లతనం.”
“రంగ తనయుడైన ఇవ్వాల్టి రాధకి అలనాటి రాధ వాల్యూలో 1% అర్ధమైతే తను కూడా మాటల రాధ కాకుండా, చేతల రాధ అయ్యేవాడు. నేను నా సినిమా తేడాగా తీస్తే రంగా గారి ఫ్యాన్స్ ఊరుకోరు అని వార్నింగ్ ఇచ్చిన రాధకి నా కౌంటర్ వార్నింగ్, ముందు ఫ్లాష్ బ్యాక్ అర్ధం చేసుకో. ఇవ్వాల్టి రాధ కన్నా ఆనాటి రాధ, రంగాలతో నేనెక్కువ సమయం గడిపాను. ఇవ్వాల్టి రాధని పిల్లోడిగా బ్యాక్ గ్రౌండ్ లో ఆడుకోవడం చూసాను.”
“రంగా గారు తన కుమారుడ్ని గురించి… వీడు ఎంత పెరిగినా ఇంకా పిల్లోడ్లా ప్రవర్తిస్తాడు, నేను షాక్ తిన్నాను ఇప్పటికీ ఆయన పిల్లోడే. రంగా గారి అభిమానులందరినీ నేను గౌరవిస్తాను, కానీ రంగా గారి గురించి నెహ్రూ గారికి తెలిసినంత కూడా తెలియని రాధని నేను… నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు కానీ, కాపు అయ్యనుండి కూడా కాపులేనకాల దాక్కునే కమ్మ మనస్తత్వమున్న వాడిని ఫస్ట్ టైం చూస్తున్నాను.” అంటూ ట్వీట్ల హోరు వినిపించారు.
బహుశా ఇటీవల ఓ మీడియా ఛానల్ లో వంగవీటి రాధ ఇచ్చిన ఇంటర్వ్యూకు వర్మ బదులిచ్చినట్లున్నారు. అయితే వర్మ మాటలు చూస్తుంటే, నెహ్రూ వర్గానికి అనుకూలంగా సినిమా ఉండే అవకాశాలు కనపడుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Priya Bhavani Shankar is taking the internet by storm with her latest indoor photoshoot, proving…
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…