Telugu

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా రివ్యూ: దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

చిత్రం: రంభ ఊర్వశి మేనక

M9 రేటింగ్: 1.5/5

ADVERTISEMENT

విడుదల తేదీ: సెప్టెంబర్ 04, 2026

తారాగణం: అల్లరి నరేష్, సురభి, నరేష్, రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ తదితరులు

నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ – అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకత్వం: చంద్రమోహన్

సంగీతం: చైతన్ భరద్వాజ్

నిర్మాత: రాజేష్ దండా – ప్రసాద్ నిమ్మకాయల

ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి

కూర్పు: చోటా కె.ప్రసాద్

అల్లరి నరేష్ తన కంఫర్టబుల్ కామెడీ జోనర్ కి కంబ్యాక్ ఇచ్చి నటించిన చిత్రం “రంభ ఊర్వశి మేనక”. శర్వానంద్ తో “రాధ” అనే సినిమా తీసిన చంద్రమోహన్ తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఫాంటసీ జానర్ లో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ ఇది. మరి అల్లరి నరేష్ కామెడీ సినిమాతోనైనా కంబ్యాక్ ఇవ్వగలిగాడా? ఒక డీసెంట్ హిట్టు కొట్టగలిగాడా? అనేది చూద్దాం..!!

కథ:

చిన్నప్పటినుండి తమ కుటుంబానికి మాత్రమే చెందిన ఒక పుస్తకాన్ని గుడ్డిగా నమ్మేసి, దాన్ని క్రాక్ చేస్తే రంభ ఊర్వశి మేనకలు స్వర్గం నుండి దిగి వచ్చి, కోరుకున్న వరాలన్నీ నెరవేరుస్తారని.. ఆ పుస్తకాన్ని తెరవడం కోసం నానా ఇబ్బందులూ పడుతుంటాడు సూరి (అల్లరి నరేష్). అనుకోకుండా ఒకరోజు ఆ బుక్ ని క్రాక్ చేసి.. దేవ కన్యలను భూమ్మీదకి రప్పిస్తాడు.
కోరికలు తీర్చాల్సిన దేవకన్యలు.. ఇంద్రుడి కోపం కారణంగా సాధారణ యువతులుగా మారిపోతారు. దాంతో సూరి ప్లాన్స్ అన్నీ అడ్డం తిరుగుతాయి.
తన చుట్టూ ఉన్న సమస్యల సుడిగుండాల నుండి సూరి ఎలా బయటపడ్డాడు? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు:

అల్లరి నరేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి లాంటివి. ఆల్రెడీ ఈ తరహా పాత్రలు కనీసం ఓ 40 సినిమాల్లో పోషించి ఉంటాడు. అయితే.. క్యారెక్టర్ లోనే కొత్తదనం లేకపోవడంతో, అల్లరి నరేష్ నటనలోనూ ఆ నవ్యత లోపిస్తుంది. చాలా రొటీన్ క్యారెక్టర్ ఫీల్ ఇస్తుంది.
సురభి ఈ సినిమాతో చాలారోజుల తర్వాత తెరపై కనిపించింది. కానీ.. నటిగా మునుపటికంటే నీరసంగా కనిపించింది. ఇక దేవకన్యలుగా రాశి సింగ్, విష్ణు ప్రియ, ప్రిషా సింగ్ లు అందంగా కనిపించినప్పటికీ.. ఒక్కరి ముఖంలోనూ హావభావాలు కనిపించలేదు. అందువల్ల.. మోడల్స్ ను చూసిన భావన ఉంటుంది తప్పితే.. నటీమణులను చూసిన భావన మాత్రం రాదు.
ఇక నరేష్, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి లాంటి కమెడియన్లు నవ్వించడానికి చేసిన ప్రయత్నాలు.. సరైన సన్నివేశాలు, సంభాషణలు లేకపోవడం వల్ల బెడిసికొట్టాయి.

సాంకేతికవర్గం పనితీరు:

సినిమా మొత్తంలో టెక్నికల్ గా చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క విషయం లేని మీడియం బడ్జెట్ సినిమా ఇదే..

చైతన్ భరద్వాజ్ పాటల్లో ఒక్కటే గుర్తుండదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, కలరింగ్, ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి డిపార్ట్మెంట్స్ పరిస్థితులన్నీ ఇంతే.

మరి నిర్మాతలు ఖర్చు పెట్టలేదా.. లేక కావాలనే ఇలాంటి అవుట్ పుట్ ని ప్రేక్షకుల మీదకి వదిలారా? అనేది వాళ్ళకే తెలియాలి.

దర్శకుడు చంద్రమోహన్ ఎంచుకున్న కథ ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసేసాం. రంభ-ఊర్వశి-మేనక అనే దేవకన్యలు తప్పితే.. కథనంలో కొత్తదనం అనేది ఇసుమంతైనా లేదు. ఇక క్యారెక్టర్స్ మరియు కామెడీని కన్సీవ్ చేసిన విధానం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫైనల్ గా.. డైరెక్టర్ చంద్రమోహన్ తన రెండో ప్రయత్నంలోనూ విఫలమయ్యాడనే చెప్పాలి.

విశ్లేషణ:

అల్లరి నరేష్ స్వయంగా ఇలాంటి సినిమాలు ఆల్రెడీ ఓ మూడు చేశాడు. సీనియర్ హీరో అయ్యుండి, కామెడీ & ఎమోషన్స్ మీద అంత హోల్డ్ ఉన్నప్పటికీ ఇలాంటి అవుట్ డేటెడ్ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనేది పెద్ద ప్రశ్న. హీరోగా అతని క్రెడిబిలిటీకి ఇలాంటి సినిమాలు భంగం కలిగించేవే కానీ.. ఆయన కెరీర్ కి ఏమాత్రం పనికొచ్చేవి కాదు. ఈ విషయాన్ని అల్లరి నరేష్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇక సినిమాగా “రంభ ఊర్వశి మేనక” చాలా అవుట్ డేటెడ్ కంటెంట్. 20 ఏళ్ల క్రితం ఈ తరహా సినిమాలు ఏమైనా ఆడే అవకాశం ఉందేమో కానీ.. ఇప్పుడు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కనీస స్థాయిలో అలరించదు. అల్లరోడ్ని ఆడియన్స్ కామెడీ చేస్తుంటే చూడాలనుకుంటున్న విషయం వాస్తవమే అయినప్పటికీ.. అది ఇలాంటి సినిమా కాదు. నరేష్ త్వరగా రియలైజ్ అయ్యి.. క్వాలిటీ ఉన్న కంటెంట్ ను ఎంచుకుని, హీరోగా మాత్రమే కాక నటుడిగానూ తన సత్తాను చాటుకోవాల్సిన అవసరం ఉంది.

ఓవరాల్ గా.. దేవకన్యలు సైతం కాపాడలేకపోయారు!

M9 రేటింగ్: 1.5/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Recent Posts

OTT Deal: The Key to Vishwambhara’s Release

Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…

34 minutes ago

కొండా అడుగులు ఎటువైపు.?

కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…

55 minutes ago