
కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న “రుద్రాక్ష” సినిమా సోషియో ఫాంటసీ కధగా సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శైవత్వంతో కూడిన ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో కనువిందు చేయనుండగా, మరో కీలక పాత్రకు రమ్యకృష్ణను ఎంపిక చేసారు. పెళ్ళయిన తర్వాత మొదటిసారిగా తన భర్త దర్శకత్వంలో రమ్యకృష్ణ నటిస్తుండడం ఈ పాత్రపై మరింత ఆసక్తికి కలుగజేస్తోంది. అంతకుముందు వీరిద్దరి కాంభినేషన్ లో ‘చంద్రలేఖ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
‘బాహుబలి’ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో నటవిశ్వరూపం చూపించే పాత్రగా సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలాగే ‘బాహుబలి’ సినిమా మాదిరే ఈ సినిమాలో కూడా గ్రాఫిక్స్, విజువల్ వండర్ గా రూపుదిద్దుకోబోతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక దర్శకుడు కృష్ణవంశీ నిమగ్నమయ్యారు.
Madhavan's GDN directed by Krishnakumar Ramakumar was released in theatres on August 7th and has…
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…