
ఇది అలా ఉండగా… ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. తాజాగా తెలిసిన విషయం ఏమిటంటే… ఈ చిత్రం రన్ టైం కూడా చాలా కాన్వెనినెంట్ గా ఉంటుందట. కేవలం రెండు గంటల పదినిముషాల సినిమా అని…. ఫస్ట్ హాఫ్ కామెడీ… సెకండ్ హాఫ్ ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంటున్నారు.
లాస్ట్ వీకెండ్ తెలుగు చిత్ర పరిశ్రమకు భారీగా నిరాశపరిచింది. విష్ణు మంచు యొక్క మోసగాళ్లు, కార్తికేయ యొక్క చావు కబురు చల్లగా, మరియు ఆది యొక్క శశి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా ముగిశాయి. లాక్డౌన్ తరువాత టాలీవుడ్ లో ఇది అతిపెద్ద అల్లకల్లోలం. ఈ సమయంలో హిట్ కొట్టడానికి నితిన్ కు ఇది మంచి అవకాశం.
మొదటి వారాంతం తరువాత సోమవారం హోలీ హాలిడే రావడం చిత్రానికి బాగా కలిసివస్తుంది. ఒకవేళ మంచి టాక్ వస్తే వసూళ్లు భారీగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. కీర్తి సురేష్ తన కేరీర్లోనే మొదటిసారిగా లైవ్లీ పాత్రలో కనిపిస్తుందట.
Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…
The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…