రవితేజ సంపాదనను కూడా సెలబ్రేట్ చేస్తున్నారు!

‘ఇరుముడి’కి ముందు రవితేజ వరుసగా ఆరు డిజాస్టర్లు ఇచ్చారు. ఆ సినిమాల ఫలితాల కంటే ఆయనపై వచ్చిన ట్రోలింగ్ ఇంకా ఎక్కువ.

చెత్త స్క్రిప్టులు ఎంచుకుంటున్నారని విమర్శించారు. తనకంటే చాలా చిన్న వయసున్న హీరోయిన్లతో నటిస్తున్నారని ట్రోల్ చేశారు. ఆ హీరోయిన్ల పాత్రలు, వారిని చూపించిన విధానం, వారి చుట్టూ నడిచే కమర్షియల్ మసాలా… ఇలా ప్రతి విషయంలోనూ రవితేజను టార్గెట్ చేశారు.

ADVERTISEMENT

దీంతో కొన్నేళ్లుగా రవితేజ ఏ సినిమా చేసినా నెగెటివ్ చర్చే ఎక్కువగా కనిపించింది.

కానీ ‘ఇరుముడి’తో సీన్ మొత్తం మారిపోయింది.

ఈ సినిమాకు రవితేజ రెమ్యునరేషన్ తీసుకోకుండా నైజాం హక్కులు ఉంచుకున్నారని సమాచారం. సినిమా మంచి విజయం సాధించడంతో ఆయనకు రావాల్సిన సాధారణ రెమ్యునరేషన్ కంటే ఇప్పుడు దాదాపు ఐదు రెట్లు ఎక్కువే దక్కే అవకాశం ఉందని అంచనా.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే… గత కొన్నేళ్లుగా రవితేజను ట్రోల్ చేసిన అదే సినీ అభిమానులు ఇప్పుడు ఆయన సంపాదనను కూడా ఏదో వాళ్ళకే డబ్బు వచ్చేసినట్టు పోస్టులు వేసుకుంటున్నారు. రవన్న భారీగా సంపాదిస్తున్నాడంటూ సంతోషపడుతున్నారు.

వినడానికి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ సినీ అభిమానులు ఇలాగే ఉంటారు.

చెత్త సినిమా ఇస్తే హీరోను వదలకుండా వెంటపడతారు. మంచి సినిమా, ప్రేక్షకులను మెప్పించే సినిమా ఇస్తే అదే హీరోకు వచ్చే డబ్బును కూడా తమ విజయంలా సెలబ్రేట్ చేస్తారు.

‘ఇరుముడి’తో రవితేజ తనపై ఉన్న నెగెటివిటీని పూర్తిగా తిప్పేశారు. ఈ విజయంతో పాటు గత కొన్నేళ్ల అనుభవాల నుంచి కూడా ఆయన సరైన పాఠం నేర్చుకున్నారని ఆశిద్దాం.

Share
Chaitanya Krishna

I’m passionate about Telugu cinema, but I also enjoy watching films in other languages, especially Malayalam and Tamil. I love offering critical yet meaningful analysis of movies.

Published by

Recent Posts

Prahaar Review: Controversial Subject, Weak Screenplay

After a long wait, Rajkummar Rao’s Prahaar has arrived on the big screen. The actor…

24 minutes ago

Jailer 2 BO 2nd Day: Rajinikanth’s 1000 Crore Dream ON?

Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…

8 hours ago