
ఆచార్య మే 13న ప్రేక్షకుల ముందుకు రానుండగా…. #బిబి3 మే 28న విడుదల అని ప్రకటించింది. డైరెక్ట్ గా క్లాష్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు రవితేజ ద్వారా బాలయ్య సినిమా ని ఎటాక్ చేస్తున్నారు మెగా అభిమానులు. రవితేజ ఖిలాడీ మే 28నే విడుదల అవుతుందని నిర్మాతలు బాలయ్య కంటే ముందే ప్రకటించారు.
ఇప్పటివరకు బాలయ్య… రవితేజలు మూడు సార్లు క్లాష్ అయ్యారు. 2008లో కృష్ణ… ఒక్క మగాడు, 2009లో కిక్… మిత్రుడు, 2011 మిరపకాయ్, పరమవీరచక్ర బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అయ్యాయి. అయితే మూడు పర్యాయాలు రవితేజ దే పై చెయ్యి అయ్యింది. అయితే ఈ సారి చెప్పినంత తేలికగా ఉండదు పోటీ.
#బిబి3 బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం దాని మీద హైప్ గట్టిగా ఉంటుంది. రవితేజ ఫామ్ మునిపటిలా లేదు. క్రాక్ తో హిట్ కొట్టినా క్లాష్ కి ఖిలాడీ నిర్మాతలు రెడీ అంటారా అనేది అనుమానమే. దీనితో అసలు పోటీ ఉంటుందా అనేది చూడాలి. పోటీ ఉంటే మాత్రం మెగా అభిమానులు పూర్తిగా కో-ఆపరేట్ చేసి బాలయ్యని ఓడిస్తారట.
Naga Chaitanya’s Vrushakarma is gearing up for a theatrical release on December 4. Extending Dussehra…
Vaibhav Sooryavanshi has shown his talent at a young age, but finding a regular place…