Telugu

క్రాక్ గా మారుతున్న మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రానికి క్రాక్ గా నామకరణం చేశారు. ఈరోజు ఉదయం సినిమా ముహూర్తం జరుపుకుంది. తొందరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. గెడ్డంతో మెలితిప్పిన మీసంతో రవితేజ అదిరిపోయాడు.

ADVERTISEMENT

ఈ  సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ప్రస్తుతం రవితేజ వీఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కాకముందే రవితేజ మరో సినిమాను ఒప్పుకోవడంతో ఆయనెంత స్పీడు మీదున్నారో అర్ధమవుతుంది.

ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హీరోగా రవితేజకు ఇది 66వ సినిమా. ఇందులో మాస్ రాజా మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథను తయారు చేశాం అని చిత్రబృందం ప్రకటించింది. 
ఇది ఇలా ఉండగా డిస్కో రాజా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. తొలుత క్రిస్మస్ కు సినిమాను విడుదల చెయ్యాలి అనుకున్నా జనవరికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది జనవరి 24న గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

PK Back In Films? Not in Near Future?

The deputy CM of Andhra Pradesh, Pawan Kalyan has another facet and it is regarding…

7 minutes ago

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

25 minutes ago