
టీజర్ తో సినిమాలో ఏం ఉంటుందో ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఇప్పుడు విమర్శలకు దూరంగా ఉండాలని చేసినా ప్రయత్నమా ఇది? అయితే ట్రైలర్ కట్ చూస్తే చాలా సబ్-స్టాండర్డ్ గా అవుట్ డేటెడ్ గా అనిపించింది. మరి ఆడియన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోగలదో చూడాల్సి ఉంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణతర కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ నెలలోనే విడుదల చెయ్యడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
సి కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రాన్ని దర్శకుడు శంకర్ భాను తెరకెక్కించాడు. తేజుస్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుంది. ఆర్ఎక్స్ చిత్రం సక్సెస్ తరువాత పాయల్ కు సరైన సినిమా పడలేదు. ఆమె వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తుంది. ఈ తరుణంలో ఆమె ఇటువంటి బి గ్రేడ్ చిత్రంలో నటించడం ఆ చిత్ర బృందాన్ని కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. టాలీవుడ్ లో తన కేరీర్ ను పెంచుకోవడానికి ఆమె రెండు రకాల ప్రయత్నాలు చేస్తుంది… ఏమవుతుందో చూడాలి
The glimpse of Koffee With Karan’s upcoming episode is out now. It will feature Varun…
Malayalam cinema remains unpredictable, as a film’s box-office performance often depends more on its content…