Telugu

సంచలన విషయం… షేక్ స్పియర్ మహిళ అంట..!

దాదాపు 400 ఏళ్ల క్రితం మరణించిన షేక్ స్పియర్ ఎవరు? అనే విషయంలో పలు కథనాలు ప్రచారంలో ఉండగా, వాస్తవాలు తెలుసుకునేందుకు స్టాన్ ఫోర్డ్ లోని ట్రినిటి చర్చిలో ఉన్న షేక్ స్పియర్ సమాధిపై కూడా పరిశోధనలు జరిగాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ద్వారా పరిశోధకులు పరిశోధించగా, 1794లోనే ఆ సమాధి నుంచి పుర్రెను మాయం అయినట్టు గుర్తించారు. దీంతో ఆమె స్త్రీనా? లేక పురుషుడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.

దీనిని అన్వేషించేందుకు రంగంలోకి దిగిన జాన్ హడ్సన్ సరికొత్త విషయాలను ప్రపంచానికి పరిచయం చేసాడు. విద్యార్థికి స్థాయి నుండి ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న రచయిత విలియమ్ షేక్ స్పియర్ ‘పురుషుడు కాదు మహిళ’ అంటూ ‘షేక్ స్పియర్ డార్క్ లేడీ’ అనే పుస్తకంలో జాన్ హడ్సన్ తెలిపారు. షేక్ స్పియర్ సాహిత్యం, జీవితంపై ఎన్నో పరిశోధనలు చేసిన అనంతరం, ఆమె అసలు పేరు అమేలియా బస్సానో అని, ఆమె పూర్వీకులు క్వీన్ ఎలిజబెత్-1 దగ్గర సంగీత విద్వాంసులుగా పని చేశారని చెబుతున్నారు.

ADVERTISEMENT

షేక్ స్పియర్ నల్లని కురులు కలిగిన ‘యూదు’ స్త్రీ అని, ఇంగ్లిష్ ధియేటర్ లో ఇంచార్జ్ గా పని చేసే లార్డ్ చాంబర్లేన్ హెన్రీ కేర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారని సదరు పుస్తకంలో పేర్కొన్నారు. షేక్ స్పియర్ కుటుంబం ఇటలీ నుంచి వలస వచ్చిందని, అందుకే ఆమె నాటకాల్లో ఇటలీ సంస్కృతి కనిపిస్తుందని, ‘ఒథెల్లో’ నాటకంలోని అమేలీ, ‘మర్చెంట్ ఆఫ్ వెనిస్’ నాటకంలోని బస్సానో క్యారెక్టర్లు ఆమె అసలు పేరును ప్రతిబింబిస్తున్నాయని, క్రిస్టోఫర్ మార్లో అనే ప్రసిద్ధ రచయితతో కూడా ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయని, దాని ఫలితంగా మరణించే నాటికి గర్భవతి అని సంచలన విషయాలను పుస్తకంలో పేర్కొన్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Toughest Test for a Star Kid in the Social Media Era?

Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…

2 minutes ago

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

10 minutes ago