పవన్ పై, కులాలపై హీట్ పెంచిన దర్శకుడు!

అసలే కుల కుంపటితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భగ్గుమనే పరిస్థితిలో ఉంటే, వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ దానికి మరింత ఆజ్యం పోసే విధంగా ట్వీట్లు చేయడం విశేషం. అందులోనూ పవన్ కళ్యాణ్ ను మరియు ఆయన అభిమానులను మరోసారి ఏకిపారేయడం విశేషం.

“ఇప్పుడే పవన్ కళ్యాణ్ తుని కాపు సమస్య ప్రెస్ మీట్ చూసాను… తనిచ్చిన స్పీచ్ తనకన్నా అర్థమైందా అని నా డౌట్? ప్రెస్ మీట్ కు వస్తున్నపుడు కార్లో తన పక్కనున్న వాడి చెప్పుడు మాటలతో ప్రభావితం అయ్యి ఇచ్చిన స్పీచ్ లా ఉంది. కమ్మల మనస్తత్వమున్న కాపుల కన్నా స్వచ్చమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు… విశ్వదాభిరామ వినుర వేమ!”

ADVERTISEMENT

“ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పవన్ కళ్యాణ్ కు నా విజ్ఞప్తి… ఒక్కసారి మీరిచ్చిన జనసేన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి. పవన్ అభిమానిగా నేను వ్యక్తపరిచిన నిజాలన్నీ వ్యతిరేకించిన ఏ పవన్ కళ్యాణ్ అభిమాని అయినా నా దృష్టిలో నమ్మకద్రోహి. జనసేన పార్టీ లాంచింగ్ స్పీచ్ ను రిపీట్ మోడ్ లో చూసి పవన్ అర్ధం చేసుకోవాలని, ప్రస్తుతం అతని సోదరుడి కన్నా వరస్ట్ గా మారారని” అన్నారు.

“పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే… తమ గుండెల్లో ఉన్న నిజాన్ని అందరూ పవన్ కు చెప్పాలని, నేను ఎంత చిత్తశుద్దితో చెప్తున్నానో అలాగే ఫ్యాన్స్ కూడా చెప్పాలని” కోరుకుంటున్నానని వర్మ చేసిన ట్వీట్లు యథావిధిగా వెబ్ వరల్డ్ లో సందడి చేస్తున్నాయి.

ఒకప్పుడు సినిమాలపై, సెలబ్రిటీల వరకే పరిమితమైన వర్మ, ఇటీవల కులాల ప్రస్తావన ఎక్కువగా తెస్తుండడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా “వంగవీటి” సినిమా ప్రారంభించిన నాటి నుండి వర్మ “కాపు – కమ్మ” అన్న కులాల ప్రస్తావన ఎక్కువగా తెస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

5 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

8 hours ago