
టైమ్స్ నౌలోని ఒక కథనం ప్రకారం, మాదకద్రవ్యాల వాడకానికి పేరుగాంచిన బి-టౌన్ పెద్ద స్టార్ల పేర్లను రియా డిపార్టుమెంటుకు చెప్పిందట. “దీని ప్రకారం, ఎన్సిబి యొక్క స్కానర్ కింద 18-19 పెద్ద స్టార్ల పేర్లు ఉన్నాయి” అని ఆ నివేదిక తెలిపింది. ఇది నిజమైతే, ఆ పెద్ద తారలు తమకు ఉన్న పలుకుబడితో ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉంది.
గత వారం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తి సోదరుడు షోయిక్ చక్రవర్తిని, మరియు సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండాను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. తాజాగా ఈ నటిని కూడా అరెస్టు చేయవచ్చని పుకార్లు ఉన్నాయి. ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉంటే అరెస్టు తప్పదని న్యాయనిపుణులు అంటున్నారు.
ఇప్పటికే సుశాంత్ కేసుకు సంబంధించి రియా కుటుంబంపై ఈడీ, సిబిఐలు కేసులు నమోదు చేశాయి. సుశాంత్ మృతిపై కుట్ర కోణం ఉందా అని మొదలైన ఈ కేసు ఆ తరువాత మనీ లాండరింగ్, మాదకద్రవ్యాల పై మలుపు తిరగడం గమనార్హం. కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూద్దాం.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…