
ఆదివారం నాడు ప్రసారమయ్యే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రోజా, ‘అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి’ స్పందించారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అనితపై తానూ ఏ కామెంట్ చేయలేదని అనగా, మరి వీడియో క్లిప్ గురించి ప్రస్తావించంగా, అదంతా ‘అభూత కల్పన,’ మీడియా వాళ్ళే సృష్టించారనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. “మీరు కల్పించి చెబితే నేనేం చేయను” అంటూ కార్యక్రమం నిర్వాహకుడ్ని రోజా తిరిగి ప్రశ్నించడం కొసమెరుపు.
అయితే ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు మాత్రం రోజాపై ఛలోక్తులు వేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను నేను చేయలేదు అని మాత్రమే రోజా అంది, అలా కాకుండా అసలు అక్కడ నేను లేను, అదంతా ‘బాహుబలి’ గ్రాఫిక్స్ మాదిరి తనను, జగన్ ను కావాలనే అక్కడ సృష్టించారని చెప్పలేదు, సంతోషం అన్న రీతిలో కామెంట్లు పడుతున్నాయి. అలాగే, రోజా చేసిన “నాలుక” విన్యాసాల గురించి సదరు కార్యక్రమం నిర్వాహకుడు అడగలేదు గానీ, దానిపై ఏ విధమైన మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చేదో… అని నెటిజన్లు చేస్తున్న కామెంట్లు కోకొల్లలు!
The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…
Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…