
సంక్రాంతి 2020 కోసం విడుదల చేయాల్సిన సినిమా నిరవధికంగా వాయిదా పడింది. తాజాగా మనకు ఉన్న సమాచారం ప్రకారం రాజమౌళి ఇక జరిగిన ఆలస్యం చాలని… అక్టోబర్ 5 నుండి షూట్ ను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నారు. మార్చి / ఏప్రిల్ నాటికి షూట్ పూర్తి చేసి రామ్ చరణ్, ఎన్టీఆర్లను ఈ సినిమా నుండి రిలీవ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు.
అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే… ఈ చిత్రం 2021 రెండవ భాగంలో విడుదల అవుతుంది. అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం.
రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ వారియర్ పాత్రలో నటించనున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ విడుదలై సూపర్ రెస్పాన్స్ రాబట్టింది. ఎన్టీఆర్ టీజర్ కూడా విడుదల కావాల్సి ఉన్నా, లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది.
Delhi Capitals have added another former India cricketer to their coaching staff ahead of IPL…
The latest episode of Bigg Boss saw Shalini re-enter the house. On Sunday, the show…