Telugu

ఫ్యాన్ కు ఆర్ఆర్ఆర్ టీమ్ సర్ప్రైజ్

ఈరోజు జనవరి 8, 2021… ప్రపంచం మీద కరోనా ప్రభావం అంటూ లేకపోయి ఉంటే ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి మల్టీ స్టారర్ సినిమా… ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉంది. తాజాగా ఆ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. అంటే అనుకున్న సమయానికంటే ఏడాది ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దానితో జనవరి 8, 2021 విడుదలకు సంబంధించిన ఆర్ఆర్ఆర్ టీమ్ ట్వీట్లను ఫ్యాన్స్ కోట్ చేసి బాధపడుతున్నారు. వారి బాధ చూడలేకపోయిన రాజమౌళి కుమారుడు ఒక ఫ్యాన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. సదరు హేమంత్ అనే ఫ్యాన్ మరి కొందరు ఫ్యాన్స్ ని సెలెక్ట్ చేసి వారికి ఆర్ఆర్ఆర్ సెట్లను చూపిస్తాడట.

ADVERTISEMENT

దానితో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. రామ్ చరణ్ కరోనా బారిన పడిన కారణంగా షూటింగ్ మందగించింది. మరోవైపు… అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ అనే ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆధారంగా ఆర్ఆర్ఆర్ ఒక కల్పిత కథ. వారి పోరాటాలకు ముందు ఢీల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో అనేది ఈ చిత్రం.

ఎన్టీఆర్ సరసన ఒక బ్రిటిష్ హీరోయిన్ నటిస్తుంది. ఈ మల్టీస్టారర్ చిత్రంతో అలియా భట్ తన తెలుగు అరంగేట్రం చేయనుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ తో సరసన ఆమె కనిపించనుంది. చిత్రంలోని ఒక కీలక పాత్రలో మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించనున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Nellore Municipal Polls: TDP-Janasena Seat-Sharing Talks Hit a Roadblock

The alliance between the Telugu Desam Party (TDP) and Jana Sena has hit a hurdle…

9 minutes ago

RGV’s Police Company Starts With AI Controversy

Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…

39 minutes ago