మహేష్ బాబూ… అభిమానులు క్లారిటీ కావాలంటున్నారు..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో “బ్రహ్మోత్సవం” చిత్రంలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్రం 2016 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ బాషల్లో తెరకేక్కబోయే చిత్రంలో నటించనున్నారు. అయితే ఇటీవల ఈ రెండు చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది.

వెబ్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న సమాచారం ప్రకారం… తొలిసారిగా ప్రిన్స్ మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనువిందు చేయబోతున్నారన్న వార్త ప్రచారంలోకి రాగా, కొందరేమో “బ్రహ్మోత్సవం”లో డ్యూయల్ రోల్ అని, మరికొందరు మురుగదాస్ చిత్రంలో డ్యూయల్ రోల్ అని చెప్తున్నారు. దీంతో అసలు ఏ చిత్రంలో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారనే సందేహం ప్రిన్స్ అభిమానుల మదిలో నెలకొని ఉంది.

అసలు మహేష్ ఒక్క చిత్రంలోనైనా ద్విపాత్రాభినయం చేస్తున్నారా? ఒకవేళ చేస్తే ఏ సినిమాలో చేస్తున్నారో చెప్పాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు. అయితే అది ఏ సినిమా అయినా… మొదటిసారి పూర్తి స్థాయిలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నారనే వార్త ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలను ఆకాశంలో నిలబెడుతుందనడంలో సందేహం లేదు.

Share
Published by

Recent Posts

Vijaya Sai New Party: But Who’s The CM?

After being a crucial member in the team of former CM YS Jagan for more…

18 minutes ago

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

38 minutes ago