
ఆ సీన్ కు అంత అయ్యిందట. ఆ హీరో లేదా ఆ హీరోయిన్ గెస్ట్ రోల్ అట అని నోటికి ఏది వస్తే అది ప్రచురించేస్తారు. నెగటివ్ పబ్లిసిటీ కాదు కాబట్టి చిత్రబృందం కూడా పట్టించుకోదు. రాజమౌళి సినిమా కాబట్టి ఎన్ని కోట్లు అని రాసేసినా ఎవరూ కాదనలేరు. దీనితో మీడియాకు మేత వేసినట్టే. ఆర్ఆర్ఆర్ విషయంలోనూ అదే జరుగుతుంది. తాజా సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కు 25 కోట్లు, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కు 15 కోట్లు అని వార్త వచ్చింది. ఏది నిజమో ఏది అబద్దమో తెలియని పరిస్థితి.
మెగా నందమూరి అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గత కొంత కాలంగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి బ్రేక్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ గ్యాప్ లోనే రాజమౌళి ఏదో పర్సనల్ పని మీద అమెరికా వెళ్లారట. వచ్చిన వెంటనే షూటింగ్ మొదలు అవుతుందని తెలిపింది చిత్రబృందం. తొందరలోనే ఉత్తర భారతంలో ఒక షెడ్యూల్ ఉంటుందని సమాచారం. అహ్మదాబాద్, పూణే లలో రామ్ చరణ్, అలియా భట్ ల పై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తారట.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…