
ఒక్క పాటలో కూడా ప్రభాస్ డాన్స్ వెయ్యకపోవడం వారిని మరింత నిరాశపరుస్తుంది. ఇక పాటల విడుదల ప్లాన్ కూడా తేడాగానే ఉంది. సినిమా విడుదల కేవలం ఇంకో మూడు రోజులు ఉండగా కూడా ఇంకా పాటలు విడుదల చేస్తూనే ఉన్నారు. ఈరోజు బేబీ వొంట్ యూ టెల్ మీ నౌ అనే పాట విడుదల చేశారు. ఫ్యాన్స్ కూడా సరిగా ఈ పాటను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నారు. అంతా మొదటి రోజు తమ టిక్కెట్లు సంపాదించుకునే పని ఉన్నారు. దీనితో ఈ స్ట్రాటజీ తేడాగానే ఉంది.
చూడబోతే సాహూ టీం… సినిమా రిలీజ్ తరువాత కూడా పాటలు విడుదల చేస్తారేమో? అంటూ సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు. ఒకప్పుడు పెద్ద హీరో సినిమాలకు నెల ముందు పాటలు విడుదల చేసేవారు. ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేసే వారు. ఇప్పుడు ఈ కొత్త పాటల విడుదల విధానంతో పాటలు ఎంజాయ్ చెయ్యడానికి టైమ్ కూడా ఉండటం లేదు. మరోవైపు సినిమా ప్రమోషన్స్ కోసం ప్రభాస్ దేశమంతా చక్కర్లు కొడుతున్నాడు. తెలుగు కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు.
Ranbir Kapoor and Sai Pallavi portray Lord Rama and Maa Sita in the newly released…
Chief Minister N. Chandrababu Naidu’s ‘Kamsa Uncle’ remark has put YSRCP chief Y.S. Jagan Mohan…