Telugu

‘గబ్బర్ సింగ్’ను కాపీ కొట్టేసాడుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుకరించడం… తద్వారా సినిమాకు పబ్లిసిటీ రాబట్టుకోవడం చిన్న సినిమాలకు మామూలే. ఆ క్రమంలోనే తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ “సుప్రీమ్” సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పోస్టర్ ను మాదిరి సాయిధరమ్ తేజ్ కూడా పంచె కట్టుకుని నమస్తే పెడుతూ ‘సుప్రీమ్’ సినిమాకు గానూ ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు.

మే 5వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఫుల్ కమర్షియల్ అంశాలతో నిండి ఉందని చెప్పిన సాయి, పవన్ అభిమానులను ఆకర్షించే క్రమంలో భాగంగా ‘గబ్బర్ సింగ్’ స్టైల్లో దర్శనమిచ్చారు. మరి ఇలాంటి పబ్లిసిటీ జిమ్మిక్కులు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో తెలియాలంటే తొలిరోజు ‘సుప్రీమ్’పై మెగా అభిమానుల స్పందన వరకు వెయిట్ చేయాలి. సాయికి జతగా రాశి ఖన్నా నటించిన ఈ సినిమాను ‘పటాస్’ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించగా, సుప్రసిద్ధ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

ADVERTISEMENT
Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

TFPC Election Results 2026: C Kalyan’s Mana Panel Scores Big Win

The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…

19 minutes ago

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

47 minutes ago