
ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమాకు హీరోయిన్ కంఫర్మ్ కాలేదు. వారానికి ఒక హీరోయిన్ పేరు వినపడుతుంది. తాజాగా వినపడుతున్న పేరు … దబాంగ్ 3 తో సినిమాలకు పరిచయమైన శాయి మంజ్రేకర్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి చర్చలు జరుపుతున్నారట.
కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, అల్లు బాబీ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. వరుణ్ నటించబోతున్న పదో సినిమా ఇది. గద్దలకొండ గణేష్ సినిమాలో ఊర మాస్‌గా కనిపించిన వరుణ్ ఇప్పుడు బాక్సర్‌గా ఎలా ఉంటారో చూడాలి.
ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సినిమాకు సంగీతం అందిస్తారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిపాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమా స్టోరీ ప్రకారం తండ్రి మంచి బాక్సర్. అతను బాక్సర్‌గా సాధించలేనిది.. తన కొడుకుతో ఎలా తన తీరని కోరికను ఎలా నెరవేర్చుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…