
నిన్ననే ఎగ్జిట్ పోల్స్ గురించి రాసి ఈరోజు ఇంకో ఐటెం అదన్నమాట. సరే ఒకటో తారీఖుకు జీతం ఇచ్చే యజమాని ఆ మాత్రం స్వామి భక్తి ఎందుకు ఉండదు? ఆ ఐటెంలో టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన సర్వే సంస్థలను దుమ్మెత్తి పోసింది. లగడపాటి రాజగోపాల్ వంటి వారిని అయితే రెండు రోజులుగా ఆ పార్టీ వారు శాపనార్ధాలే పెట్టేస్తున్నారు. ఇక విషయానికి వస్తే టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చిన సంస్థలను ఏకంగా బోగస్ అనేసింది సాక్షి.
“మిషన్ చాణక్య సంస్థ వైఎస్సార్సీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయటపెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేలు విడుదల చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది”, ఇది ఆ ఐటెం లోని ఒక మాట. విషయానికి వస్తే మిషన్ చాణక్య అనే సంస్థ పేరే ఎవరూ విని ఉండరు. టుడేస్ చాణక్య సర్వే కరెక్టో తప్పో తెలీదు గానీ 2014 ఎన్నికలలో బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందని లెక్కలతో సహా కరెక్టుగా చెప్పిన సంస్థ అది. సాక్షి తన సౌకర్యం కోసం దానిని బోగస్ సంస్థ చేసేసింది.
Palak Tiwari is bringing full sunshine energy to the fashion frame, and this mustard yellow…
Maruthi got a massive opportunity with Prabhas’ The Raja Saab, but the film’s disastrous performance…