
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ రూపొందిన ఈ సినిమాలో సల్మాన్, అనుష్కల పాత్రలను ఇంతకు ముందే టీజర్ రూపంలో విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన ‘సుల్తాన్’ ట్రైలర్ కు వీక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తోంది.
రెజ్లర్ ‘సుల్తాన్’ కిక్ బాక్సర్ గా మారిన వైనం సినిమా కధగా స్పష్టమైంది. అయితే మరో వైపు లవ్ స్టోరీని కనెక్ట్ చేస్తూ సాగిన సినిమా కధ సల్మాన్ అభిమానులను ఆకట్టుకునేలా ఉండడంతో “సుల్తాన్”పై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. ఇప్పటికే నెలకొన్న అంచనాలను మరింత రెట్టింపు అయ్యే విధంగా ట్రైలర్ ఉండడంతో కండల వీరుడు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ.
Polling for the MPTC and ZPTC elections in Andhra Pradesh witnessed incidents of clashes and…
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…