
లాక్ డౌన్ సమయంలో సమంత తన పర్సనల్ లైఫ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇంటి టెర్రస్‌పై పండ్డు, కూరగాయలను పండిస్తూ సెలెబ్రిటీలకు గ్రో విత్ మీ అంటూ సవాళ్లను విసురుతోంది. అర్భన్ ఫార్మింగ్‌లో సమంత ఆరి తేరిపోయింది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన వంటలు ఎలా వండాలో కూడా నేర్చుకుంది.
తాజాగా లాక్ డౌన్ సమయంలో మరో కొత్త అంకం కూడా మొదలు పెట్టింది ఈ అమ్మడు… తన సొంత క్లాతింగ్ బ్రాండ్ ని మొదలుపెట్టబోతున్నట్టు కాసేపటి క్రితం ప్రకటించింది. దానికి సాకీ అనే పేరు కూడా పెట్టేసింది. దీనికి సంబంధించిన కసరత్తు అంతా లాక్ డౌన్ సమయంలోనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది.
“నేను ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మన స్నేహాన్ని పెంపొందించుకోవడం, నా జీవితాన్ని పంచుకోవడం మరియు మీతో మధురమైన క్షణాలు సృష్టించడం సాకీ నాకో మార్గం, అది ప్రత్యేకమైనది మరియు మనది. త్వరలో ప్రారంభించబోతున్నాము మరియు మీ అందరికీ ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. వేచి ఉండండి! ,” అని సమంత పోస్టు చేసింది.
తన దుస్తుల బ్రాండ్ అందరికీ అందుబాటులో ఉంటుందని, సరసమైనదని ఆమె చెప్పుకొచ్చింది. సాకీ కల నిజం చేసుకోవడానికి సమంతా మరియు ఆమె బృందం చేసిన కృషి యొక్క చిన్న వీడియోను నటి పోస్ట్ చేసింది. ఈ కొత్త వ్యాపారంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…