
ఒక టెర్రరిస్టు పాత్రలో మొట్టమొదటి సారి సమంత మేక్ అప్ లేకుండా నటించింది. అలాగే టెర్రరిస్టు లా కనిపించడానికి తనను తాను ఎంతగానో మార్చుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే ఆ వెబ్ సిరీస్ కోసం ఆమె చాలా నెలలే కష్టపడిందని సులువుగా అర్ధం అవుతుంది. అయితే సమంత ఈ వెబ్ సిరీస్ కే కాదు తన తదుపరి చిత్రం ‘శాకుంతలం’ కు కూడా అంతే కష్టపడిందట.
ఒక ఇంటర్వ్యూలో ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ… “ఆమె రెండు నెలలు కష్టపడి క్లాసికల్ బాడీ లాంగ్వేజ్, అలాగే బాడీని నాజుకుగా మరల్చుకుంది,” అని చెప్పుకొచ్చారు. కేరీర్ లో మొదటి సారి మైథలాజికల్ సినిమా చేస్తున్నందున తాను సినిమా కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమని ఆమె హామీ ఇచ్చిందంట.
ఏది ఏమైనా పెళ్లి తరువాత సమంత తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విభిన్నమైన సినిమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకోసం ఆమె చాలానే కష్టపడుతున్నట్టు కూడా స్పష్టం అవుతుంది. అయితే ఆమె కష్టానికి ఏ మేరకు ఫలితం రాబోతుంది అనేది ది ఫ్యామిలీ మాన్ 2 వరకునైనా కాసేపట్లో బయటపడిపోతుంది.
Akshay Kumar’s Haiwaan has had a weak run at the box office. Directed by Priyadarshan…
Vishwak Sen is heading into an unusual phase of his career. Not because he has…