Telugu

సమంత అన్నీ చెప్పింది… ఆ ఒక్కటీ తప్ప..!

గత నాలుగైదు మాసాలుగా ఎప్పుడూ వార్తల్లో నిలిచిన సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారంటే… అది ఒక్క సమంత మాత్రమేనని చెప్పాలి. ఎప్పుడైతే ‘24’ సినిమా ప్రమోషన్లో తనకు కాబోయే వాడి పేరు ‘ఎన్’ అక్షరంతో మొదలవుతుంది అని చెప్పిందో… అప్పటినుండి మొదలైన హడావుడి తాజాగా అభిమానుల ట్వీట్స్ కు సమాధానాలు చెప్పినవరకు నిరంతరాయంగా కొనసాగుతోంది.

ADVERTISEMENT

తన చిన్ననాటి సంగతులు మొదలుకుని, తన విద్యాబుద్ధుల సర్టిఫికేట్ల వరకు అన్ని విశేషాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్న సమంత… ‘బర్నింగ్ ప్రశ్న’గా మారిన తన పెళ్లిపైన కూడా స్పందించింది. డిసెంబర్ లో వివాహం అన్నట్లుగా వచ్చిన పుకార్ల గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘కాదు’ అని జవాబు చెప్పింది. అలాగే మరో అభిమాని అడిగిన ‘జనతా గ్యారేజ్ మీ చివరి సినిమానా?’ అన్న దానికి ‘ఇంకా చాలాకాలం సినిమాల్లో నటించాలని ఉందని, అది రూమర్ అయితే బాగుండు’ అని చెప్పిన సమాధానాలు మరో హాట్ హాట్ చర్చలకు తెరలేపాయి.

డిసెంబర్ లో పెళ్లి కాదు అని చెప్పింది అంటే… బహుశా డిసెంబర్ కంటే ముందే దానికి ముహూర్తం ఖరారైందేమో అన్న ఊహాగానాలకు తెరలేపినట్లయ్యింది. అలాగే ‘జనతా గ్యారేజ్’ సినిమానే చివరిది అన్న విషయంలో కూడా… స్పష్టమైన జవాబు చెప్పకుండా… అది రూమర్ అయితే బాగుంటుంది అని చెప్పడం అంటే… సినిమాల నుండి వైదొలగాలన్న ఒత్తిడి తనపై ఉన్నట్లుగా సమంత అభిప్రాయ పడినట్లు సినీ జనాలు చెప్పుకుంటున్నారు. అయితే అన్నింటికీ కాస్తో కూస్తో సమాధానం చెప్పుకొచ్చిన సమంత, వరుడు విషయంలో మాత్రం నోరు మెదపకపోవడం విశేషం.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

అరడజను సినిమాలు వచ్చాయి.. సందడి మాత్రం రాలేదు!

ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…

20 minutes ago

Pakistan Players Mocked Earlier? Now Rohit? Fans Speechless

Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…

31 minutes ago