
ఇరు రాష్ట్రాల సీఎంల ఆదేశాల మేరకు, జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ ఆదేశాలను టోల్ సిబ్బంది పాటించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలు రాష్ట్రరహదారులకే పరిమితం అని.. ఎన్‌హెచ్‌ఐ నుంచి ఆదేశాలు రాలేదని టోల్‌ప్లాజాల నిర్వాహకులు అంటున్నారు. దీనితో టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ భూ భాగంలోని టోల్ గేట్ల వద్ద ఇది ఉద్రిక్తనికి దారి తీసింది.
రాష్ట్రంపై కేంద్రప్రభుత్వానికి ఇది మరో నిదర్శనం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొన్ని టోల్ గేట్ల వద్దకు పోలీసులను పంపింది. ప్రభుత్వ ఆదేశాలు పాటించని టోల్ ప్లాజాల నిర్వాహకులను దగ్గర ఉండి మరీ దారికి తెస్తున్నారు. ట్రాఫిక్ నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. టోల్ వసూల్ చేయ్యనివ్వడం లేదు. దీనితో అధికారుల మీద దౌర్జన్యం అంటూ కేసులు పెట్టమని టోల్ ప్లాజా అధికారులను తమ పై అధికారులు ఒత్తిడి చేస్తున్నారట. పండగ పూట కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లడాయికి దిగపడటం దురదృష్టకరం. ఎప్పటిలాగానే ప్రజలే నలిగిపోతున్నారు వీరి మధ్యలో.
As we had been extensively reporting for the last few hours, Tamil Nadu assembly elections…
Recent data from Digital Trends highlights the global streaming race. The numbers show how competitive…