
ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించిన ‘సరైనోడు’ సినిమా పాటల వేడుకను ఏప్రిల్ 2వ తేదీన జరపబోతున్నట్లు తెలుస్తోంది. ముహూర్తం ఫిక్స్ కావడంతో ప్రస్తుతం వెన్యూ కోసం వెతుకుతున్నారట. ఆడియో ఈవెంట్ విషయం ఇలా ఉంటే, సినిమాను ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ వార్తలతో మెగా ఫ్యాన్స్ ఖుషీలో మునిగి తేలుతున్నారు.
ఏప్రిల్ మొదటి వారం 2వ తేదీన ‘సరైనోడు’ ఆడియో వేడుక, రెండవ వారం 8వ తేదీన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ రిలీజ్, మూడవ వారం 15వ తేదీన ‘ఒక మనసు’ విడుదల, నాలుగవ వారం 22వ తేదీన ‘సరైనోడు’ విడుదల, అయిదవ వారం 29న ‘సుప్రీం’ విడుదల అని ట్రేడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న విషయం. అయితే, ‘ఒక మనసు, సుప్రీం’ చిత్రాల విడుదలలు ‘సర్ధార్, సరైనోడు’ సినిమా ఫలితాలపై ఆధారపడి ఉంటాయని టాక్. అది జరిగినా… పవన్ స్థామినా మేరకు ‘సర్ధార్’ రెండు వారాలు, బన్నీ రేంజ్ వరకు ‘సరైనోడు’ ఒక వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం ఖాయం మరి.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి…
The IT and software sector has been one of the biggest contributors to revenue generation…