
“సినిమాలను చూడడం మానేసి చాలా కాలమైందని, అయితే నా మనుమడి ఆకాంక్ష మేరకు ‘బాహుబలి సినిమాను చూశానని, నిజంగా ఇదొక ‘స్టుపిడ్’ సినిమా అని, సాంకేతిక విలువలు తప్ప సినిమాలో ఏమీ లేదని, ఒక్క హీరో పాత్ర తప్ప, మిగతా పాత్రలకు ప్రాధాన్యం లేదని…” ఇలా రాజమౌళి చెక్కిన ‘బాహుబలి’ సినిమా గురించి ఎటువంటి మొహమాటం లేకుండా వ్యక్తపరిచింది.
ఒక సినిమాను ఒక్కొక్కరూ ఒక్కో మూడ్ లో చూస్తుంటారు. అలాగే సినిమా పూర్తయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఏర్పడవచ్చు. ఆ క్రమంలోనే ‘బాహుబలి’ సినిమా ఒక ‘స్టుపిడ్’ పిక్చర్ లా సీనియర్ నటీమణి జమునకు అనిపించవచ్చు. ఇందులో విమర్శలకు తావు లేదు. నిజానికి ‘బాహుబలి’ సినిమా చూసిన తర్వాత చాలా మంది ప్రేక్షకులు, విమర్శకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలను “బాహుబలి” సినిమా కధ అందుకోలేకపోయిందన్నది వాస్తవం.
కానీ, నాణానికి మరో వైపు నుండి చూస్తే… “బాహుబలి” అనే సినిమా తెలుగు వాడి సత్తాకు నిదర్శనంగా నిలిచింది. ప్రపంచమే నివ్వెరపోయే కలెక్షన్స్ ను, జమున చెప్పినట్లు అద్బుతమైన సాంకేతిక విలువలకు అందరూ దాసోహమన్నారు. తెలుగు సినిమా స్థాయిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన “బాహుబలి” ఇపుడు ఇలా విమర్శించడం… ఒక విధంగా చాదస్తమేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయ పడుతున్నారు.
కొన్ని సినిమాలకు లభించిన ఆదరణను పరిగణనలోనికి తీసుకున్నపుడు, ఆ సినిమా సాధించిన అద్భుతాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే… ఎక్కువ శాతం మంది పట్టం కట్టారు కాబట్టి. నేడు జమున విమర్శించిన ఈ “బాహుబలి” సినిమానే అతి త్వరలో చైనాలో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. మరి అంతటి అద్భుతాలను సృష్టించిన సినిమాను విమర్శిస్తే… మన కన్నుతో మనమే పొడుచుకున్నట్లు కాదా? ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే ఇలా “స్టుపిడ్” తరహాలో వ్యాఖ్యానించడం… మన కీర్తిప్రతిష్టతలను మనమే తగ్గించుకున్నట్లు కాదా? ఒక్కసారి ఆలోచించండి..!
Mahendragiri Varahi, starring Sumanth, has created interest among audiences with a promotional campaign. While the…
Nayanthara started 2026 on a strong note with Mana Shankara Vara Prasad Garu. The Chiranjeevi…