
గుణశేఖర్ సినిమా అంటేనే సెట్లకు పెట్టింది పేరు… పైగా ఇప్పుడు పీరియడ్ సినిమా. పర్ణశాల మామూలుగానే ఉన్నా పువ్వులతో చేసిన జింక, ఏనుగు సెట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో టాకింగ్ పాయింట్ అయ్యాయి. ఈ ప్రేమకథ మహాభారతంలో ఒక సబ్‌ప్లాట్. సమంత మరియు చిత్ర హీరో దేవ్ మోహన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ చిత్రాన్ని గుణశేఖర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీనికి పాన్-ఇండియా అప్పీల్ ఉన్నందున, ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల అవుతుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అవుతుంది. కరోనా మహమ్మారి తరువాత సెట్స్ మీదకు వెళ్ళిన సమంత మొదటి చిత్రం ఇది.
“నా కెరీర్ కొన్ని పాత్రలు చెయ్యలేనేమో అని బాధ పడే దానిని. రొమాంటిక్, విలన్, యాక్షన్ ఇలా అన్ని పాత్రలు చేశాను. కానీ నా డ్రీమ్ రోల్ అంటే పీరియాడికల్ రోల్, రాజకుమారి పాత్రలను చేయాలని అనుకున్నాను. ఇప్పటికీ నేను ఖాళీగా ఉంటే డిస్నీ సినిమాలు చూస్తుంటాను. నా కెరీర్‌లో ఇలాంటి సమయంలో ఈ పాత్ర ఇవ్వడం మరిచిపోలేని గొప్ప బహుమతి,” అని సమంత చాలా ఎక్సయిటింగ్ గా చెప్పుకొచ్చింది.
Literally anything can happen any time in the film industry and politics. Anyone can become…
Salman Khan is currently going through a difficult phase at the box office. However, the…