
ఈ చిత్రం గత వారం స్టార్ మా లో ప్రసారం చేయబడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం వరల్డ్‌వైడ్ టెలివిజన్ ప్రీమియర్ 11.1 టీవీఆర్ రేటింగ్స్‌ను అందించింది. ఐదేళ్ల తర్వాత ఈ చిత్రం టెలివిజన్‌లో ప్రసారం చేసిందనే విషయాన్ని పరిశీలిస్తే ఇది చాలా మంచి రేటింగ్. అలాగే, హాలీవుడ్ సినిమా లయన్ కింగ్ యొక్క తెలుగు ప్రీమియర్ 7.7 టివిఆర్ రేటింగ్స్ కూడా ఇచ్చింది.
చూడటానికి పెద్దగా సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల కూడా ప్రేక్షకులు పాత సినిమాల వైపు కూడా మొగ్గు చూపుతున్నారని నిపుణులు అంటున్నారు. విక్రమ్ మరియు శంకర్ ఇద్దరూ ఇటీవలి కాలంలో ఫామ్ లో లేరు. వారు చాలా కాలం నుండి పెద్ద హిట్ కోసం వెచ్చి చూస్తున్నారు.
విక్రమ్ ప్రస్తుతం కోబ్రా అనే చిత్రంలో నటిస్తుండగా, శంకర్ భారతీయుడు 2 లో కమల్ హాసన్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా ఉదృతి కొంత తగ్గితే షూటింగులు మొదలు పెట్టాలని చూస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ లోనైనా సాధ్య పడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో టీడీపి, వైసీపీల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకవైపు కింజారపు అచ్చన్నాయుడు తదితరులు, మరోవైపు ధర్మాన…
Big films may bring bigger collections, but their ticket price hikes could make life harder…