Telugu

శర్వానంద్ వల్ల ఇది సాధ్యం అవుతుందా?

Sreekaram తమిళ బ్లాక్ బస్టర్ 96 రీమేక్ సినిమా కోసం స్కై డైవింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మయంలో శ‌ర్వానంద్ భుజం, కాలికి గాయాల‌య్యాల‌యి. షోల‌ర్డ్ బోన్ డిస్ లొకేట్ అయ్యింది. దీనితో ఆయనకు ఇటీవలే ఆయనకు సర్జరీ అయ్యింది. రెండు నెలల పాటు బెడ్ రెస్టు చెప్పారు డాక్టర్లు. అయితే శర్వానంద్ ఈరోజు ఒక కొత్త సినిమా మొదలు పెట్టాడు. కొత్త దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వం వస్తున్న ఈ సినిమా పేరు శ్రీకారం. ఈరోజు ఉదయం పూజా కార్యక్రమం జరిగింది.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. ఆగష్టులో షూటింగ్ మొదలు కానుంది. అయితే ఇది సాధ్యం అవుతుందా అనేది చూడాలి. రెండు నెలలు బెడ్ రెస్టు అంటే ఆగష్టు చివరకు శర్వానంద్ షూటింగ్ మొదలు పెడతాడు. ఈ సినిమా కాకుండా 96 రీమేక్ కూడా పూర్తి చెయ్యాలి. కొంత భాగం సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. శ్రీకారం సినిమా మొదలు పెట్టి ఐదు నెలలలోనే పూర్తి చెయ్యాలి. ఇది అంత తేలికైన విషయం కాదు.

ADVERTISEMENT

అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ చిత్ర ముహూర్తానికి శర్వా కూడా వచ్చాడు. దెబ్బ తాలుక ఇబ్బంది ఏమీ కనిపించలేదు. దీనితో అనుకున్న దానికంటే ముందే శర్వా షూటింగ్ మొదలు పెడతాడా అనేది చూడాలి. రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించనున్నారు. మరోవైపు శర్వా నటిస్తున్న ‘రణరంగం’ ట్రైలర్‌ శనివారం విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ‘రణరంగం’ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

BB Telugu: Dakshi & Shalini Out Of Game

Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…

32 minutes ago

వైఎస్, లోకేష్, పవన్ మారారు.. జగన్‌ మారలేరా?

ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…

41 minutes ago