Telugu

“సింగ్ గీతం” సినిమా రివ్యూ: ఓ అపూర్వ ప్రయత్నం!

చిత్రం: సింగ్ గీతం

M9 రేటింగ్: రెస్పెక్ట్/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూన్ 12, 2026

తారాగణం: అహిల్య, అయాన్, శాలిని, బెనర్జీ, రచ్చ రవి తదితరులు

నిర్మాణ సంస్థ: వైజయంతి మూవీస్ – స్వప్న సినిమా

దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు

సంగీతం: దేవిశ్రీప్రసాద్

నిర్మాత: నాగ్ అశ్విన్

ఛాయాగ్రహణం: అంకుర్.సి

కూర్పు: సింగీతం శ్రీనివాస రావు

సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు తెరకెక్కించిన తాజా చిత్రం “సింగ్ గీతం”. నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంతోపాటు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన ఈ చిత్రానికి సంకల్ప్ అనే కుర్రాడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ద్వారా అయాన్, అహిల్య వెండితెరకు పరిచయమయ్యారు. సినిమాలో 60%పైగా మాటలు పాటల్లా ఉంటాయి. సో ఈ సింగ్ గీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం..!!

కథ:

కుబేరపురం అనే ఊర్లో తనకు సంబంధించిన 99 ఎకరాలు ఉన్నాయని తెలుసుకొని జైల్ నుండి డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళిపోతాడు ప్రతాప్ (అయాన్). ఊరు మొత్తానికి బ్రతికున్న ఒకే ఒక్క చెట్టుకు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్న గౌరి (అహిల్య) మరియు కుబేరా మైన్స్ ను అమ్మేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న రేణు (శాలిని) పరిచయమవుతారు.

కట్ చేస్తే.. ఓ ఉదయం నిద్రలేచాక ఊర్లో వాళ్ళందరూ మాట్లాడలేక, పాటలు పాడుతూ ఉంటారు. వాళ్లకి ఏదో శాపం తగిలింది అని అర్థం చేసుకొని శాప విమోచనం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

అసలు ఊరికి తగిలిన శాపం ఏమిటి? అందుకు కారకులు ఎవరు? దాన్నుంచి ఎలా బయటపడ్డారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “సింగ్ గీతం” చిత్రం.

నటీనటుల పనితీరు:

అహిల్య తన చురుకైన నటన, హావభావాలతో అందరికంటే ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ఆమె నటనలో సహజత్వం ఉంది. ప్రేమ, కోపం, బేలతనం వంటి భావాల్ని అద్భుతంగా పండించింది.

అయాన్ స్క్రీన్ ప్రెజన్స్ బాగుంది. యాక్టింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త పరిణితి అవసరం. సింగర్ కాబట్టి మాటల్ని పాటల్లా బాగా మ్యానేజ్ చేశాడు. శాలిని పాత్రలో రెండు వైవిధ్యమైన షేడ్స్ ఉన్నాయి. వాటిని పొందికగా ప్రదర్శించింది.

రచ్చ రవికి మరోసారి మంచి పాత్ర లభించింది. ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నాడు. శివన్నారాయణ, రంగస్థలం మహేష్, బెనర్జీ, తులసి, అగు స్టాన్లీ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తిస్థాయి న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ హీరో అని చెప్పొచ్చు. సింగీతం గారి ఆలోచనను అర్థం చేసుకోవడమే కాకుండా.. ఆ ఆలోచనను తెరపై వినసొంపుగా ప్రెజెంట్ చేసిన దేవిశ్రీప్రసాద్ ప్రశంసార్హుడు. బహుశా పాటలనే కాక మాటలను కూడా కంపోజ్ చేసిన ఏకైక సంగీత దర్శకుడిగా భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాడు దేవి.

అదే విధంగా రచయితల బృందం గౌతమి చల్లగుల్ల, శశాంక్ చింతలపూడి, రత్న శ్రీకర్, నందకిషోర్ ఈమాని, రాహుల్ వి.రాజేశ్వర్ లను కూడా మెచ్చుకోవాలి. శృతిలో మాటలు రాయడం అనేది అంత సులభం కాదు, కథనం విషయంలోనూ వాళ్లు తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంకల్ప్ ను కూడా మెచ్చుకోవాలి. సింగీతం వర్చువల్ గా డైరెక్ట్ చేయగా, ఆయన ఇచ్చే ఇన్పుట్స్ ను అర్థం చేసుకొని.. వాటిని ఎగ్జిక్యూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరి నుండి మంచి నటన రాబట్టుకున్నాడు. బ్యాగ్రౌండ్ ఆర్టిస్టుల్లో ఒక్కటంటే ఒక్క నాన్ సింక్ ఎక్స్ ప్రెషన్ కనిపించలేదు. సంకల్ప్ & మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంత బాగా వర్క్ చేశారు అనేందుకు నిదర్శనం ఇది.

నిర్మాతగా నాగ్ అశ్విన్ కు సినిమా మీద ఉన్న ప్రేమను, అభిమానాన్ని మెచ్చుకోవాల్సిందే. అతనికి సింగీతం మీద ఉన్న గౌరవం వల్లే “సింగ్ గీతం” అనే 40 ఏళ్ల క్రితం సింగీతం గారు ఊహించుకున్న కథ/ఆలోచన చిత్రరూపం దాల్చాయి.

సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ లో చాలా తప్పులు దొర్లినప్పటికీ.. కాన్సెప్ట్ లో ఉన్న నావెల్టి వాటిని కవర్ చేసింది. ముఖ్యంగా సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. క్లైమాక్స్ లో సీజీ తేలిపోయింది.

సింగీతం గారికి ఒక దర్శకుడిగా/రచయితగా ఇలాంటి ఆలోచన 40 ఏళ్ల క్రితం రావడం, దాన్ని ఎంతో నవ్యతతో, నేర్పుతో తెరకెక్కించడం అనేది సినిమాకి మెయిన్ హైలైట్. ఆలోచన, కథనం, ముగింపు ఒక కొత్త సినిమా చూశామనే భావన కలిగించగా.. సినిమా ద్వారా చెప్పిన నీతి ప్రస్తుత సమాజానికి ఎంత అవసరమో, ప్రపంచానికి అంతే అవసరం. సో, ఆయన మేధాశక్తికి, కార్యదక్షతకు సలాం చెప్పడమే ఒక సినిమా అభిమానిగా సగటు ప్రేక్షకుడు ఆయనకి ఇవ్వగలిగే మర్యాద.

విశ్లేషణ:

సినిమా అనేది రంజింపజేయాలి, సినిమా ఆలోజింపచేయాలి. ఈమధ్యకాలంలో ప్రేక్షకుల మనసులో లేదా మెదళ్లలో ఒక ఆలోచన రేకెత్తించే సినిమాలు తెలుగులో అరుదైపోయాయి. ఆ కొరతను తీర్చిన సినిమా “సింగ్ గీతం”. అయితే.. ఇది ఎలాంటి సినిమా అనేది తెలుసుకొని థియేటర్ కి వస్తే బెటర్, లేదంటే మాత్రం మాటల్ని పాటలుగా అందరూ ఎంజాయ్ చేయలేరు.

సో, సింగీతం గారి ఆలోచన, దేవిశ్రీప్రసాద్ పాటలు-మాటలు, క్లైమాక్స్ లో పండిన అద్భుతమైన ఎమోషన్ కోసం “సింగ్ గీతం” సినిమాని కచ్చితంగా థియేటర్లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే.

ఓవరాల్ గా.. ఓ అపూర్వ ప్రయత్నం!

M9 రేటింగ్: రెస్పెక్ట్/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

2 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

3 hours ago