
సున్నితమైన ‘ఆత్మ’ల కధ తీసుకోవడంతో ‘మనం’ మాదిరే మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారని అప్పట్లో ట్రేడ్ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే ‘మనం’ మాదిరే మరో హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి నాగ్ సిద్ధమయ్యాడని ధియేటిరికల్ ట్రైలర్ చెప్తోంది. ఇంత వయసులోనూ నాగ్ అదిరిపోయే లుక్స్ అభిమానులకు కన్నుల పండుగగా నిలవగా, సినిమాలోని భారీ కాస్టింగ్ వీనుల విందుగా మారింది.
రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠిల గ్లామర్ లుక్స్ తో పాటు ఇప్పటివరకు ఊరించిన ‘జబర్ధస్త్’ అనసూయ అప్పిరియన్స్ నుండి హాట్ హాట్ సాంగ్స్ కేరాఫ్ అడ్రస్ గా మారిన హంసా నందిని షేప్ ల వరకు అన్నింటినీ ఈ ట్రైలర్ లో చూపించారు. అనూప్ రూబెన్స్ అందించిన నేపధ్య సంగీతం కూడా వినసొంపుగా ఉంది. మరో ట్విస్ట్ ఏమిటంటే… 2016 సంక్రాంతి కానుకగా ఈ “సోగ్గాడే చిన్నినాయనా” విడుదల కానుంది. అక్కినేని అభిమానులకు ఇంత కంటే కావాల్సింది ఏముంది..! ప్రస్తుతానికైతే ట్రైలర్ చూస్తూ పండగ చేసుకోవడమే…!
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…