
బహుశా ఆ కొరతను “సోగ్గాడే చిన్నినాయనా” దర్శకుడు కళ్యాణ్ కృష్ణ పూడ్చినట్లున్నారు. సినిమాలు ఎందుకు ‘ఫెయిల్’ అవుతాయో అన్నదానికి అందరికీ వర్తించే విధంగా కళ్యాణ్ ఇచ్చిన ప్రకటనకు సినీ విశ్లేషకులు కూడా మద్దతు పలుకుతున్నారు. “సోగ్గాడే చిన్నినాయనా” చిత్ర సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
“మీరు ఏదైనా ఒక ప్రకటన చేసినపుడు నేను ఒప్పుకోవాలి కదా… అపుడు ఇద్దరి మధ్య డిస్కషన్ ప్రారంభమవుతుంది కదా… అదే నేను సినిమాలో చెప్పాననుకోండి… డిస్కషన్ ఉండదు కదా… రిజెక్ట్ చేయడమే..! అక్కడే ఫెయిల్ అవుతుంది. ధియేటర్లో కూర్చుని వన్ సైడ్ స్టేట్మెంట్లు మాట్లాడలేరు… సింపుల్ గా బాలేదు అంటారు…” అంతే! అన్న కళ్యాణ్ కృష్ణ వ్యాఖ్యలు సమర్ధనీయంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
“సినిమా అంటే ఒక కామన్ సెన్స్” అని తన గురువు తేజ చెప్పేవారని, స్క్రిప్ట్ దైవం అని పోసాని గారు చెప్పేవారని కళ్యాణ్ కృష్ణ కూల్ గా చెప్తున్న ప్రకటనలు చూపరులను తన వైపుకు తిప్పుకునేలా ఉన్నాయి. మొత్తమ్మీద “సోగ్గాడే చిన్నినాయనా” సక్సెస్ కళ్యాణ్ కృష్ణ నెత్తికెక్కించుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.
Gopichand Malineni found the right formula for Sunny Deol in Jaat. He understood the veteran…
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…