
ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ వారసురిలిగా వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా, బోయపాటి సినిమాలో హీరోయిన్‌గా నటించనుందన్న టాక్ వినిపించింది. గతంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన లింగ సినిమాలో నటించిన సోనాక్షి మరోసారి సౌత్ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చారు.
అయితే ఇదంతా నిజం కాదని సోనాక్షి తేల్చి చెప్పింది. తాను ఈ సినిమా నటించడం లేదని, తన తదుపరి చిత్రం ఏంటో త్వరలో ప్రకటిస్తా అని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. దీనితో బాలయ్య కు హీరోయిన్ కోసం వేట మొదటికి వచ్చినట్టే. కేథరిన్ మరో హీరోయిన్ గా కంఫర్మ్ అయ్యింది. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా ఉన్నాయి.
The global job market has started to deteriorate every single day and things are not…
Vaishnavi Chaitanya has finally addressed the age confusion surrounding her on social media. The young…