Telugu

బాలయ్య సినిమాకు బోయపాటి రాజీ

సింహా – లెజెండ్ సినిమాలతో బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబినేషన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలకృష్ణ హీరోయిజాన్ని ప్రేక్షకులకు సరికొత్తగా చూపించి మాస్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బోయపాటి. ఇప్పుడు వారి కాంబినేషన్ లో మూడవ సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తొందరలో మొదలు కాబోతుంది.

ADVERTISEMENT

2020 వేసవి చివరి భాగంలో విడుదలకు సన్నాహాలు చేస్తుంది చిత్రబృందం. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకోవాలి అనుకున్నాడు బోయపాటి అయితే ఆయన అడిగిన రెమ్యూనరేషన్ కు బోయపాటి తో పాటు నిర్మాతలకు కూడా కళ్ళు బైర్లు కమ్మాయట. దీనితో ఆ విషయంలో బోయపాటి రాజీ పడ్డాడట.

ఇప్పుడు ఆ పాత్ర కోసం శ్రీకాంత్ ను అనుకున్నారట. శ్రీకాంత్ నాగచైతన్య ప్లాప్ సినిమా ‘యుద్ధం శరణం’ లో విలన్ గా కనిపించారు. అయితే అది పెద్దగా క్లిక్ కాలేదనే చెప్పుకోవాలి. ఈ తరుణంలో ఇది రిస్క్ ఏమో. గతంలో బోయపాటి బాలయ్య లెజెండ్ సినిమాతో జగపతి బాబుని విలన్ గా నిలబెట్టి లైఫ్ ని ఇచ్చాడు. చూడాలి శ్రీకాంత్ కు ఏం జరుగుతుందో!

ఈ మధ్య బోయపాటి టైం కూడా ఏమీ బాలేదు. వరుసపరాజయాలతో ఆయన సతమతం అవుతున్నారు. దీనితో ఈ సినిమా కోసం మరింత కసిగా పని చెయ్యబోతున్నారు. గతంలో బోయపాటి జయజానకి నాయక సినిమాను నిర్మించిన మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టిస్తుంది

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Sharmila’s Wedding Venue Choice: A Calculated Move?

Y.S. Sharmila knows that her relationship with her brother, Y.S. Jagan Mohan Reddy, is already…

5 minutes ago

Shree Karthick’s Next: Rukmini Vasanth as Thara

After making his directorial debut with Oke Oka Jeevitham, Shree Karthick is preparing for his…

31 minutes ago