Telugu

“శ్రీనివాస మంగాపురం” సినిమా రివ్యూ: వర్కవుటవ్వని టెంప్లేట్ డెబ్యూట్ ఫార్ములా!

చిత్రం: శ్రీనివాస మంగాపురం

M9 రేటింగ్: 1.75/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూలై 30, 2026

తారాగణం: జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు తదితరులు

దర్శకత్వం: అజయ్ భూపతి

సంగీతం: జివి.ప్రకాష్ కుమార్

నిర్మాత: పి.కిరణ్

ఛాయాగ్రహణం: జయకృష్ణ

కూర్పు: మాధవ్ కె.గుల్లపల్లి

ఘట్టమనేని వంశం నుండి మూడో తరం కథానాయకుడిగా పరిచయమయ్యాడు రమేష్ బాబు తనయుడు జై కృష్ణ ఘట్టమనేని. మహేష్ బాబు కాస్త ప్రమోట్ చేసినా, సినిమా ప్రమోషనల్ కంటెంట్ కనీస స్థాయిలో హైప్ తీసుకురాలేకపోయింది. అజయ్ భూపతి మార్క్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? జై కృష్ణకు మంచి డెబ్యూ దొరికిందా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

సరదాగా తిరుపతి వచ్చిన కుర్రాడు శ్రీను (జై కృష్ణ ఘట్టమనేని). తొలిచూపు(?)లోనే మంగ (రాషా)ను చూసి ఇష్టపడి ఆమె వెంటపడుతూ ఉంటాడు. సరిగ్గా తన ప్రేమను చెబుదామనుకున్న సమయంలోనే తనకు వారంలో ఎంగేజ్మెంట్ అని షాక్ ఇస్తుంది మంగ.

అయితే.. ఇది తిరుపతిలో కలిగిన తొలిచూపు ప్రేమ కాదని, మంగను శ్రీను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడానికి మరో కారణం ఉందని చెబుతాడు శ్రీను. ఏమిటా కారణం? దానికి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు)కి ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానమే “శ్రీనివాస మంగాపురం” చిత్రం.

నటీనటుల పనితీరు:

జై కృష్ణ ఘట్టమనేని పెర్ఫార్మెన్స్ గురించి మొదటి సినిమాకే అతడ్ని పూర్తిస్థాయిలో జడ్జ్ చేయలేం. ఎందుకంటే.. ఒక హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి జై కృష్ణకి. అయితే.. నటనలో, బాడీ లాంగ్వేజ్ లో ఈజ్ కనిపించడం లేదు. అందువల్ల.. నటుడిగా ఆకట్టుకోవాలనే ప్రయత్నం ఫలించలేదు. అన్నిటికీ మించి హీరోగా కంటే వ్యక్తిగా, పర్సనాలిటీ పరంగా కూడా ఎదగాలి. నెక్స్ట్ సినిమాకి ఈ మైనెస్సులన్నీ ప్లస్సులుగా మార్చుకుని జై కృష్ణ మంచి రీఎంట్రీ ఇవ్వాలి.

రాషా తడాని క్యూట్ గా కనిపించడం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అసలే చాలా డైలాగ్స్ కి లిప్ సింక్ లేదు అనుకుంటే.. వాటికి క్లోజప్ పెట్టడం అనేది ఇంకా పెద్ద మైనస్. చాలా మంచి ఎమోషనల్ సీన్స్ కూడా అమ్మాయి ఎక్స్ ప్రెషన్స్ వల్ల కామెడీ అయిపోయాయి.

మోహన్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నా.. సదరు వెంకటప్పయ్య నాయుడు క్యారెక్టర్ కి కనీస స్థాయి ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడం వల్ల, అది ఓ సదరు క్యారెక్టర్ రోల్ లా మిగిలిపోయింది తప్పితే.. సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేదు.

ఇక సినిమాలో ఉన్న మిగతా ప్యాడింగ్ అంతా కూడా ఉన్నామంటే ఉన్నామనిపించుకున్నారు తప్పితే.. వాళ్ల వల్ల సినిమాకి కానీ, కథనానికి కానీ ఉపయోగం లేదు.

సాంకేతికవర్గం పనితీరు:

టెక్నికల్ గా చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ కూడా కనిపించలేదు. ఎడిటర్ మాధవ్ కె.గుళ్లపల్లి మాత్రం ప్యారలల్ లవ్ స్టోరీస్ ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మాత్రం కాస్తంత నవ్యత చూపించాడు. అదొక్క సీక్వెన్స్ తప్ప సినిమా మొత్తానికి కెమెరా పరంగా కానీ, సంగీతం పరంగా కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కానీ.. ఒక్కటంటే ఒక్క మంచి పాయింట్ లేదు. లైవ్ లొకేషన్స్ లో షూట్ చేసినప్పటికీ.. చూడానికి లొకేషన్స్ కొత్తగా కనిపించినా, సీన్స్ మాత్రం ఏమాత్రం అలరించలేకపోయాయి. నిర్మాతలు ఖర్చుకు వెనకాడడం లేదు అని అర్థమవుతూ ఉన్నప్పటికీ.. ఏ నమ్మకం మీద ఈ సినిమా మీద, ఈ కథ మీద అంత ఖర్చు చేసారు అనేది అర్థం కాలేదు.

దర్శకుడు అజయ్ భూపతి మార్క్ అనేది “ఆర్ ఎక్స్ 100, మంగళవారం” సినిమాలకి చూసాం. ఒక డిఫరెంట్ పాయింట్ తో సరికొత్త టేకింగ్ తో సినిమాల్ని నడిపిస్తుంటాడు. మరీ ముఖ్యంగా క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ కొత్తదనం అనేది “శ్రీనివాస మంగాపురం”లో ఇసుమంతైనా కనిపించలేదు. టెంప్లేట్ కథను సినిమాగా తీయడంలో తప్పులేదు కానీ.. టెంప్లేట్ ఫార్మాట్ లోనే తెరకెక్కించడం అనేది మాత్రం తప్పు. అజయ్ భూపతి లాంటి దర్శకుడు చేయాల్సిన తప్పు కాదిది. మరి అజయ్ భూపతి ఆ విషయాన్ని రియలైజ్ అవ్వలేదా అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్.

విశ్లేషణ:

టెంప్లేట్ సినిమాల కల్చర్ & ఆడియన్స్ యాక్సెప్టెన్స్ అనేది దాదాపుగా కనుమరుగైపోయింది. రొటీన్ కథను, రొటీన్ గా చెప్తామంటే ప్రేక్షకులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని మేకర్స్ సీరియస్ గా తీసుకోకపోవడం అనేది “శ్రీనివాస మంగాపురం” విషయంలో మెయిన్ మైనస్. దానికి తోడు హీరోహీరోయిన్ల ఇమ్మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అనేది మరింత నెగిటివ్ అయ్యింది. అందువల్ల.. “శ్రీనివాస మంగాపురం” అనేది ఒక రొటీన్ సినిమాగా మిగిలిపోయింది.

ఓవరాల్ గా.. వర్కవుటవ్వని టెంప్లేట్ డెబ్యూట్ ఫార్ములా!

M9 రేటింగ్: 1.75/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

4 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

5 hours ago