
వీరమల్లు కు పని చేస్తున్న సంగతిని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో అప్‌డేట్ చేశారు. “ఒక సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ & చక్కని మనిషి క్రిష్ తో… దేవుని దయవాళ్ళ వీరమల్లు కోసం పని చేస్తున్నా… ప్రతి మంచి షాట్ తర్వాత మేము పిల్లల్లాగే నవ్వుకుంటున్నాం. గాడ్ బ్లెస్స్ అవర్ మూవీ అండ్ ది టోటల్ టీం” అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ చిత్రం కథ 17 వ శతాబ్దంలో మొఘల్స్ మరియు కులీ కుతుబ్ సాహిల కాలం నాటి కథ. అవార్డు గెలుచుకున్న సినిమా షూటింగ్ ఇప్పటివరకు 40% పూర్తయిందని సమాచారం. ఈ చిత్రం సంక్రాంతి 2022 కి విడుదల కానుంది. జులై నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి సిజీ వర్క్ మీద ఎక్కువ కాలం పని చెయ్యాలని క్రిష్ భావిస్తున్నారు.
ఇది పవన్ కళ్యాణ్ కేరీర్ లో మొట్టమొదటి పీరియడ్ సినిమా. సినిమా అంచనాలు కూడా భారీగా ఉండబోతున్నాయి. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అనుకుంటున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ కు వచ్చిన సూపర్ రెస్పాన్స్ తో సినిమా మీద హైప్ బాగా పెరిగింది.
The 30th match of the Indian Premier League 2026 took place between Mumbai Indians and…
A new trend is clearly emerging in Telugu cinema, with more actors stepping into direction…