పవన్ ‘వ్యక్తిత్వం’పై సంచలన ప్రకటనలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజజీవితంలో, సినిమా సెట్స్ పై ఎలా ఉంటారో ఇప్పటికే చాలా మంది చాలా సందర్భాలలో చెప్పారు. నిజానికి పవన్ పై హల్చల్ చేసిన ఈ సమాచారంతోనే పవన్ ను ఇష్టపడ్డవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఆ కోవలోనే ‘జబర్దస్త్’ టీం సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

“పవన్ కళ్యాణ్ ను ఆరాధించే ఒక అభిమానిగా ఆయనతో నటించడం నిజంగా గొప్ప అనుభూతిని మిగిల్చిందని, తనను పేరు పెట్టి ‘సుధీర్’ అని పిలవడం ఎప్పటికీ మరిచిపోలేనని, పొరపాటున నా కాలు పవన్ సార్ కాలుకు తగిలితే తిరిగి నా కాళ్ళకు నమస్కారం పెట్టిన ఆ సంస్కారానికి ఫిదా అయిపోయానని” ఎంతో ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

‘నా స్కిట్ లు చూసి నచ్చి తనను, శంకర్ ను కావాలని తీసుకున్నానని’ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మరియు సెట్స్ లో ఆయన అంత సింపుల్ గా ఉండడం తామూ అస్సలు ఊహించలేదని, మిమ్మల్ని పిలిచి డైలాగ్ ఇంకా ఎలా చెప్తావ్… ఇంకా బాగా ట్రై చెయ్ అని చెప్తుంటే… ఎక్కడో ఊహల్లో ఉన్నట్లుందని తన అనుభూతులను ఆనందంగా పంచుకున్నాడు సుధీర్.

మొత్తమ్మీద పవన్ తో నటించాలన్న కోరికను తీర్చుకున్న సుధీర్, గురు భక్తిని కూడా బాగా చాటుకోవడంతో టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గీయులు. ఇక, పవన్ గురించి చెప్పేదేముంది… ఇలాంటి అనేక సంగతులను ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులతో పంచుకున్నారు.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

3 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

7 hours ago