
ఈ సందర్భంగా సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్ లో ‘తామెవరి తలలు నరకడం లేదని, ప్రాణత్యాగం చేస్తామ’ని పేర్కొన్నాడు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఉరి వేసుకున్నాడా? లేక శవాన్ని తెచ్చి ఎవరైనా ఉరివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ పుత్ కర్ణి సేన తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ పాత్రధారి దీపికా పదుకునే లకు భద్రత పెంచారు. వారి నివాసం వద్ద పోలీసులను మోహరించారు.
మరోవైపు సుప్రీంకోర్టులో ఈ సినిమాపై మరో వ్యాజ్యం దాఖలైంది. పద్మావతి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకముందే జర్నలిస్టులకు ప్రదర్శించారని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వచ్చే బుధవారం విచారణ జరుగనున్నట్టు తెలుస్తోంది.
Malavika Mohanan slips into a dreamy white mood and turns quiet elegance into a full…
Kind of creative choices that Ram Charan made after epic success of RRR are largely…