
మెగా వారసుడు రామ్ చరణ్ తో తన తదుపరి సినిమాకు సుకుమార్ కసరత్తులు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ‘ఫార్ములా ఎక్స్’ పేరుతో ఓ సైంటిఫిక్ సినిమాకు రూపకల్పన చేస్తున్నారన్న వార్తలు ఇటీవల హల్చల్ చేయగా, తాజా సమాచారం మేరకు ఓ గ్రామీణ ప్రేమకధా చిత్రం కోసం సుకుమార్ కలం పట్టుకున్నారని తెలుస్తోంది. మైండ్ గేమ్ సినిమాలను ఎన్ని తెలివితేటలతో సుకుమార్ తెరకేక్కిస్తారో అంతే అద్భుతంగా ప్రేమకధలను కూడా అందిస్తారన్న విషయం ‘100% లవ్, ఆర్య’ సినిమాలు చెప్పకనే చెప్పాయి.
దీంతో చెర్రీ సినిమాకు సుకుమార్ అందించబోయే కధపై ఉత్కంఠ నెలకొంది. రొటీన్ గా చెప్పడమనేది సుకుమార్ డిక్షనరీలో లేని పదం. దీంతో ఏ కధ అయినా అది సుకుమార్ స్టైల్లోనే ఉంటుంది గనుక, మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ’ సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…