Telugu

టీజర్ టాక్ – ‘మార్షల్’ ఆర్ట్స్ కు ‘గీతా’ ఆర్ట్స్ కు లింకేంటి!

కామెడీ హీరోగా స్థిరపడ్డ సునీల్ కమర్షియల్ హీరోగా ఎదిగేందుకు ‘కృష్ణాష్టమి’ ద్వారా చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే మరోసారి ‘జక్కన్న’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడని తాజాగా విడుదలైన టీజర్ స్పష్టం చేసింది. సునీల్ మంచి డ్యాన్సర్, సూపర్ కమెడియన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ, కమర్షియల్ హీరో కావాలంటే వీటితో పాటు సెంటిమెంట్ సీన్లు, యాక్షన్ సన్నివేశాలలో ప్రేక్షకులను కన్విన్స్ చేయగలగాలి.

ADVERTISEMENT

‘జక్కన్న’ ద్వారా తానూ అన్ని చేయగలను అని నిరూపించుకునే ప్రయత్నంలోనే సునీల్ ఉన్నట్లున్నాడు. అందుకే ‘జక్కన్న’ తొలి టీజర్లో సునీల్ అన్ని యాంగిల్స్ ను చూపించేసారు. ఒక రకంగా ‘ఆల్ రౌండర్’ కోసం సునీల్ పడ్డ తాపత్రయం ఈ టీజర్ లో స్పష్టంగా కనపడుతోంది. టీజర్ అంతా సునీల్ హావభావాలు – బ్యాక్ గ్రౌండ్ సంగీతంతో సాగగా, చివర్లో సప్తగిరి – సునీల్ చెప్పిన… ‘నీకు మార్షల్ ఆర్ట్స్ తెలుసా…’ అని సప్తగిరి అంటే, ‘నీకు గీతా ఆర్ట్స్ తెలుసా…’ అంటూ సునీల్ చెప్పిన డైలాగ్ వీక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను పంచుతోంది.

Share
Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

3 hours ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

3 hours ago