
కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ నటించిన సినిమాలన్నీ “కామెడీ” ప్రధానంగా రూపొందినవే. అయితే “కృష్ణాష్టమి” మాత్రం పూర్తి కమర్షియల్ అంశాలతో ఓ మామూలు హీరో సినిమా మాదిరి తెరకెక్కిందని స్పష్టమవుతోంది. సునీల్ హవాభావల్లో మునుపటి కళ గానీ, అలాగే సునీల్ తరహా కామెడీ సన్నివేశాలు గానీ ట్రైలర్ లో ఒక్కటి కూడా లేకపోవడం… బహుశా సునీల్ అభిమానులను కాస్త నిరాశపరచవచ్చు. అయితే దిల్ రాజు నిర్మాణాత్మక విలువలతో ఈ సినిమా లుక్కే మారిపోయింది. ఈ ట్రైలర్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ప్రధాన హైలైట్ గా నిలిచాయి.
అయితే హీరోగా నిలబడడానికి సునీల్ కు ఈ సినిమా ఒక పరీక్ష లాంటిదని చెప్పవచ్చు. ఓ కమర్షియల్ సబ్జెక్ట్ లో సునీల్ ను హీరోగా ఆడియన్స్ అంగీకరిస్తే సునీల్ కెరీర్ మలుపు తిరిగినట్లే, అలాగే నిర్మాతలకు కూడా మరో ఛాయిస్ దొరికినట్లే భావించవచ్చు. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన “కృష్ణాష్టమి” ట్రైలర్ వీక్షకుల కోసం…
AK47: October 16 Buzz Gets Interesting Amid Release Uncertainty Venkatesh and Trivikram Srinivas’ Aadarsha Kutumbam…
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…