
ఈ చిత్రంలో తన మేధోసంపత్తితో కోట్లు గడించిన కోచింగ్ సెంటర్లను కాదని ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎక్కడో మట్టిలో తిరిగే విద్యార్థుల కోసం ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసి వాళ్ళను ఎలా తీర్చి దిద్దాడు అన్నది కథ. రాజ్యం మీద హక్కు రాజులది, రాజుల కొడుకులది కాదు నిజంగా ఎవరైతే దానికి అర్హులో వారిది అనే మెస్సేజ్ తో వస్తున్న ఈ కథాంశం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అయితే హ్రితిక్ నుండి అభిమానులు ఆశించే సినిమా మాత్రం ఇది కాదు. అయితే ఖచ్చితంగా అందరని టచ్ చేసే కథాంశంతో హ్రితిక్ వస్తున్నాడు.
ఈ సినిమా రిలీజ్‌కు అడుగడుగున సమస్యలతో వాయిదా పడుతూ వస్తుంది. ముందుగా ఈ సినిమాని జూలై 26న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. కాని అదే రోజు గతంలో హ్రితిక్ తో వివాదాలు ఉన్న కంగనా రనౌత్ ‘మెంటల్ హై క్యా’ విడుదల అవుతుందని ప్రకటించడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడింది. బిగ్ స్క్రీన్ పై తొలిసారిగా రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను హృతిక్ పోషిస్తున్న ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఎటువంటి ఫలితం రాబడుతుందో చూడాల్సి ఉంది.
Open Twitter, Instagram, or YouTube, and you’ll see an unbelievable amount of hate aimed at…
The combination of Venkatesh and Trivikram Srinivas was expected to create strong buzz from the…