Telugu

మెగా అల్లుడు సూపర్ మచ్చి అంటున్నాడు

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ గత ఏడాది ‘విజేత’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానితో కొంత గ్యాప్ తీసుకుని తన తరువాతి ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నారు ఆయన. ఇప్పుడు సైలెంట్ గా తన రెండో సినిమా షూట్ చేస్తున్నారు.

ADVERTISEMENT

గతంలో అనేక టీవీ సీరియల్స్ కు దర్శకత్వం వహించిన పులి వాసు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూపర్ మచ్చి అనే పేరు పెట్టారు. కాసేపటి క్రితం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. వర్షంలో .. జనం మధ్యలో విజయోత్సాహంతో కల్యాణ్ దేవ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

తమన్ స్వరాలను సమకూర్చిన ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, కళ్యాణ్ దేవ్ జోడీగా రియా చక్రవర్తి కనిపించనుంది. సుమంత్‌ అశ్విన్‌ హీరోగా తెరకెక్కిన తూనీగ తూనీగ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన రియా చక్రవర్తి తరువాత బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారింది.

దాదాపు ఏడేళ్ల తరువాత ఈ సినిమాతో రియా టాలీవుడ్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని కళ్యాణ్ దేవ్ కృత నిశ్చయంతో ఉన్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

BB Telugu: Another Day Of Thrigun Fighting Rohith

One more day has passed in Bigg Boss, and one more day of Thrigun back-pitching…

35 minutes ago

Yash After Toxic: Big Lesson for Other Pan India Stars?

Toxic has been a painful chapter for Yash and his team. But the actor’s response…

1 hour ago