Telugu

సిగ్గు సిగ్గు ఇదేమి చవకబారు రాజకీయం మోడీ గారూ!

కర్ణాటక ఎన్నికల కోసమని కావేరీ బోర్డును ఏర్పాటు చెయ్యకుండా తాత్సారం చేస్తుంది మోడీ ప్రభుత్వం. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కేంద్ర ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టుకు కేంద్రప్రభుత్వం చెప్పిన సమాధానం విస్మయం కలిగించేదిగా ఉంది.

“కావేరి బోర్డు ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన డ్రాఫ్ట్ సిద్ధంగా ఉంది. కేంద్ర క్యాబినెట్ ముందు పెట్టి ఆమోదం తీసుకోవాల్సి ఉంది. కాకపోతే ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో మే 16 తరువాత దానిని చేపడతారు,” అని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

ADVERTISEMENT

ఒక రాష్ట్ర భవిష్యత్తు కంటే మాకు ఎన్నికలే ముఖ్యం అని ఇంత నిసిగ్గుగా చెప్పడం ఒక్క బీజేపీకే చెల్లింది. మే 15న కర్ణాటక ఎన్నికలు అయిపోతాయి కాబట్టి అప్పుడు కావేరి బోర్డు ఏర్పాటు చేసి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు అన్నమాట. ఇదేమి చవకబారు రాజకీయం మోడీ గారూ! ఇందుకేనా మిమ్మల్ని అశేష మెజారిటీతో ప్రజలు గెలిపించింది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Anand, Vijay, Rashmika: Deverakonda Family Battle Begins

The last quarter of 2026 is turning into an interesting period for the Deverakonda family.…

13 minutes ago

ఇచ్చట అన్ని చేదు నిజాలే చెప్పబడును: కవిత

భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…

35 minutes ago