
“ఎగ్జిబిటర్లు నష్టాలను ఎదుర్కొంటున్నారు నిజమే. సినిమాలు థియేటర్లలో విడుదల కావాలని వారు కోరుకోవడం సహజమే. అయితే నిర్మాతలు కూడా అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు ఎవరికి వారు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు వారికే వదిలేస్తే మంచింది. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను ”అని సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో అన్నారు.
ఆయన ప్రకటనను బట్టి ఈ విషయంలో ముందుకు వెళ్తారని అర్ధం అవుతుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బెదిరింపుల గురించి బాధపడే స్థితిలో ఆయన లేరని కూడా అర్ధం అవుతుంది. అయితే సురేష్ బాబు ప్రకటన పై దగ్గుబాటి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
“తమ సినిమా థియేటర్లలోనే విడుదల కావాలని ఎస్ఆర్ కల్యాణమండపం వంటి చిన్న సినిమా నిర్మాతలు కూడా ఆగుతున్నారు. సురేష్ బాబు ఇండస్ట్రీలోనే అత్యంత ధనికుడు… పైగా సురేష్ ప్రొడక్షన్స్ కు యాభై ఏళ్ల చరిత్ర అంటూ చెప్పుకుంటారు. చిన్న సినిమాల నిర్మాతలకు ఉన్న ధైర్యం కూడా లేదా?,” అంటూ వారు గట్టిగా విమర్శిస్తున్నారు.
నారప్ప అమెజాన్ ప్రైమ్ వీడియోకు, దృశ్యం 2 డిస్నీ + హాట్‌స్టార్‌కు, అలాగే విరాటపర్వం నెట్‌ఫ్లిక్స్‌కు వెళ్ళవచ్చు.
After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…
Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…